Central Govt: క్యాన్సర్ ఔషధాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
ABN, Publish Date - Oct 29 , 2024 | 05:00 PM
క్యాన్సర్ వ్యాధి నిరోధానికి వినియోగించే మందులు బాగా ఖరీదైనవి. సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ: క్యాన్సర్ రోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాధితో బాధపడుతున్న వారికి ఊరట నిచ్చేలా కీలక ఆదేశాలు జారీ చేసింది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు ప్రధాన ఔషధాల ఎంఆర్పీ (MRP) ధరలను తగ్గించింది. ఈ మేరకు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) మూడు క్యాన్సర్ నిరోధక ఔషధాల ధరలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చికిత్సలో వాడే ట్రాస్టూజుమాబ్, ఒసిమెర్టినిబ్, దుర్వాలుమాబ్ అనే మందుల ధరలు తగ్గనున్నాయి.
ఈ వ్యాధి నిరోధానికి వినియోగించే మందులు బాగా ఖరీదైనవి. సామాన్య ప్రజలకు సైతం వాటిని సరసమైన ధరలకు అందించాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ తెలిపింది. ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ 2024-25లోనే వీటికి కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం ఈ మూడు మందులపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేసింది. అలాగే జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ మేరకు ఎంఆర్పీని తగ్గించాలని తయారీదారులను ఎన్పీపీఏ ఆదేశించింది. ధరల మార్పు గురించి డీలర్లు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Salman Khan: సల్మాన్‌కు బెదిరింపులు, నొయిడా యువకుడి అరెస్టు
New Delhi: డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. 95 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత
Updated Date - Oct 29 , 2024 | 05:09 PM