ఏడు హైకోర్టులకు సీజేల నియామకం
ABN, Publish Date - Sep 22 , 2024 | 03:25 AM
దేశంలోని ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జులై 11న చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని సవరిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడంతో ఈ నియామకాలు జరిగాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: దేశంలోని ఏడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ శనివారం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జులై 11న చేసిన సిఫార్సుల్లో కొన్నింటిని సవరిస్తూ మంగళవారం సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవడంతో ఈ నియామకాలు జరిగాయి. ఇవికాకుండా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎ్‌స.రామచంద్ర రావును ఝార్ఖండ్ హైకోర్టుకు బదిలీ చేసింది. జస్టిస్ రావును ఝార్ఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ నేపథ్యంలోనే ఆయన బదిలీ జరిగింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ రాజీవ్ షక్దర్ హిమాచల్ హైకోర్టు చీఫ్ జస్టి్‌సగా పదోన్నతి పొందారు. ఇదే హైకోర్టుకు చెందిన జస్టిస్ సురేష్ కుమార్ కైత్ మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ నితిన్ మధుకర్ జమ్‌దార్ కేరళ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు. బాంబే హైకోర్టుకే చెందిన జస్టిస్ కె.ఆర్.శ్రీరాం మద్రాసు హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ ఇంద్ర ప్రసన్న మేఘాలయ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. జమ్మూ-కశ్మీర్-లద్దాఖ్ హైకోర్టు జడ్జి జస్టిస్ తాషి రబస్టాన్ అదే హైకోర్టులో సీజేగా విధులు నిర్వర్తించనున్నారు. ఆయన లద్దాఖ్ ప్రాంతానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి కానుండడం విశేషం.
Updated Date - Sep 22 , 2024 | 03:25 AM