Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

ABN, Publish Date - Jul 19 , 2024 | 09:02 AM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు.

Parliament Sessions: త్వరలో పార్లమెంటు సమావేశాలు.. 6 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభం కానున్నాయి. సభలో కేంద్ర ప్రభుత్వం ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. గురువారం సాయంత్రం లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బులెటిన్‌లో బిల్లుల జాబితాను విడుదల చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కొత్త బిల్లులు...

  • విపత్తు నిర్వహణ చట్ట సవరణ బిల్లు

  • ఆర్థిక బిల్లు

  • 1934 ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ - 2024 బిల్లు

  • బాయిలర్స్ బిల్లు

  • కాఫీ (ప్రమోషన్, అభివృద్ధి)బిల్లు

  • రబ్బరు (ప్రమోషన్, అభివృద్ధి) బిల్లు


బీఎసీ ఏర్పాటు..

ఇదిలా ఉండగా.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ అజెండాను నిర్ణయించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAS)ని కూడా ఏర్పాటు చేశారు. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీలో స్పీకర్‌తో సహా 15 మంది సభ్యులు, ఎక్స్‌అఫీషియో చైర్‌పర్సన్‌గా ఉంటారు. సభ్యులను స్పీకర్ నామినేట్ చేస్తారు. కమిటీ సాధారణంగా ప్రతి పార్లమెంటు సెషన్ ప్రారంభంలో, ఆ తర్వాత అవసరమైనప్పుడు సమావేశమవుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీని మొదటిసారిగా జులై 14, 1952న ఏర్పాటు చేశారు.

BAC సభ్యులు

  • ఓం బిర్లా - ఛైర్మన్

  • పీపీ చౌదరి (బీజేపీ)

  • నిషికాంత్ దూబే (బీజేపీ)

  • అనురాగ్ ఠాకూర్ (బీజేపీ)

  • సంజయ్ జైస్వాల్ (బీజేపీ)

  • భర్తృహరి మహతాబ్ (బీజేపీ)

  • బైజయంత్ పాండా (బీజేపీ)

  • గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్)

  • కొడికున్నిల్ సురేష్ (కాంగ్రెస్)

  • దిలేశ్వర్ కమైత్ (JDU)

  • లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ)

  • సుదీప్ బంద్యోపాధ్యాయ (TMC)

  • దయానిధి మారన్ (DMK)

  • అరవింద్ సావంత్ (శివసేన-UBT)

  • లాల్జీ వర్మ (SP)


ముగింపు ఎప్పుడంటే..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22న ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి. జూన్ 24 నుంచి జులై 2 వరకు జరిగిన 18వ లోక్‌సభ తొలి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత నిర్వహించనున్న పూర్తిస్థాయి సమావేశాలు ఇవే.

18వ సమావేశంలో నీట్-యూజీ పేపర్ లీకేజ్‌ సహా పలు అంశాలపై ప్రభుత్వం, విపక్షాల మధ్య సభలో వాగ్వాదం జరిగింది.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 27న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాయి.

For Latest News and National News click here

Updated Date - Jul 19 , 2024 | 09:02 AM

Advertising
Advertising
<