Chairman Dhankhad : కేశవరావు రాజీనామా ఆమోదం
ABN, Publish Date - Jul 06 , 2024 | 03:29 AM
రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ శుక్రవారం కె. కేశవరావు రాజీనామాను ఆమోదించారు. బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సంగతి తెలిసిందే.
ఎంపీలుగా అమృత్‌పాల్‌సింగ్, రషీద్ ప్రమాణం
న్యూఢిల్లీ, జూలై 5: రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ శుక్రవారం కె. కేశవరావు రాజీనామాను ఆమోదించారు. బీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు ఆ పార్టీని వీడి కాంగ్రె్‌సలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేశవరావు రాజీనామాతో రాజ్యసభలో 16 సీట్లు ఖాళీ అయ్యాయి. మరోవైపు జైలు నుంచి లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసి గెలుపొందిన అమృత్‌పాల్‌సింగ్, ఇంజనీర్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. పెరోల్‌పై బయటకు వచ్చిన వారు లోక్‌సభలో భారీ భద్రత నడుమ ప్రమాణం చేశారు. అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ నుంచి, రషీద్ బారాముల్లా నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించారు.
Updated Date - Jul 06 , 2024 | 03:29 AM