ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amritpal Singh: దేశంలో ప్రతి రోజు అప్రకటిత ఎమర్జెన్సీ.. ఎంపీని నిర్బంధిస్తారా..?

ABN, Publish Date - Jul 25 , 2024 | 07:32 PM

వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్‌ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Former Punjab Chief Minister, Congress MP Charanjit Singh Channi

న్యూఢిల్లీ, జులై 25: వారీస్ పంజాబ్ దే అధ్యక్షుడు, ఖదూర్ సాహెబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ చన్నీ మండిపడ్డారు. లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన అమృత్ పాల్ సింగ్‌ను నిర్బందంలో ఉంచడం ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Also Read: Minority welfare: ప్రధాని మోదీని మించిన సీఎం రేవంత్


లోక్‌సభలో అమృత్ పాల్ సింగ్ వ్యవహారం..

గురువారం లోక్‌సభలో ఎంపీ అమృత్ పాల్ సింగ్ వ్యవహారాన్ని ఆయన లేవనెత్తారు. ప్రతి రోజు దేశంలో ఎమర్జెన్సీ నీడలో ఉంటుందన్నారు. అయితే ఇది అప్రకటిత ఎమర్జెన్సీ‌ అని ఆయన అభివర్ణించారు. నియోజక వర్గంలోని లక్షలాది మంది ఓటర్లు.. అమృత్ పాల్ సింగ్‌కు అనుకూలంగా ఓటు వేసి గెలిపించారని ఈ సందర్భంగా ఎంపీ చన్నీ గుర్తు చేశారు. జాతీయ భద్రత చట్టం కింద అరెస్టయిన ఆయన్ని.. ప్రజలకు కనిపించకుండా ఇంకా నిర్బంధంలోనే ఉంచడం ఎంత వరకు సబబు అని మోదీ ప్రభుత్వాన్ని ఆయన లోక్‌సభలో నిలదీశారు.

Also Read: PM Modi: అమిత్ షాతో అజిత్ భేటీ.. కొద్ది గంటలకే.. బీజేపీలో కీలక పరిణామం


గతేడాది అమృత్ పాల్ సింగ్‌తోపాటు అనుచరులు అరెస్ట్..

గతేడాది అజనాల్ పోలీస్‌స్టేషన్ వద్ద అమృత్ పాల్ సింగ్‌‌తోపాటు అతని అనుచరులకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో అమృత్ పాల్ సింగ్‌తోపాటు తొమ్మిది మంది అనుచరులను జాతీయ భద్రత చట్టం కింద గతేడాది అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అసోంలోని దిబ్రూఘడ్ జైలుకు తరలించారు.

Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు


ఎంపీగా ఖదూర్ సాహెబ్ నుంచి గెలుపు..

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహెబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా అమృత్ పాల్ సింగ్ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో ఎంపీగా గెలుపొందారు. ఆ క్రమంలో జులై 5వ తేదీన ఆయన లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అందుకు ఆయనకు నాలుగు రోజుల పేరోల్‌పై విడుదల చేశారు.

Also Read: Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!


స్పందించిన పంజాబ్ సీఎం..

మరోవైపు అమృత్ పాల్‌ సింగ్‌కు మద్దతుగా ఎంపీ చన్నీ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ స్పందించారు. ఎంపీ చన్నీ మాటలను తాను పట్టించుకో లేదన్నారు. అయితే పంజాబ్‌లో శాంతి భద్రతలపై తాను ప్రత్యేక శ్రద్ద పెట్టానని స్పష్టం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీ చరణ్ జీత్ చన్నీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ సైతం స్పందించింది.

Also Read: Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు.. కదిలిన మోదీ సర్కార్


ఎంపీ చన్నీ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ బీజేపీ డిమాండ్...

చరణ్ జీత్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఖలిస్తాన్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం దేశానికి ప్రమాదకరమని బీజేపీ నేత వ్యాఖ్యానించారు. అయితే ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీలు భాగస్వామ్య పక్షాలున్న సంగతి అందరికీ తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 07:39 PM

Advertising
Advertising
<