ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: సీఎం స్టాలిన్‌ విమానానికి బాంబు బెదిరింపు

ABN, Publish Date - Aug 29 , 2024 | 01:25 PM

అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు.

- రాత్రంతా భద్రతా విభాగం అధికారుల జాగారం

- ముమ్మరంగా కొనసాగిన తనిఖీలు

చెన్నై: అమెరికా పర్యటనలో భాగంగా మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin), ఆయన సతీమణి దుర్గ, అధికారులు దుబాయ్‌ వెళ్తున్న విమానానికి బాంబు బెదరింపు రావటంతో భద్రతాదళం అధికారులు, సిబ్బంది రాత్రంతా తనిఖీలతో జాగారం చేశారు. ఈమెయిల్‌లో వచ్చిన ఈ బాంబు బెదిరింపు సమాచారం స్టాలిన్‌ వెళ్లే ఎమిరేట్స్‌ విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత విమానాశ్రయ అధికారులకు తెలిసింది. దీంతో విమానాశ్రయ అధికారులు విమానంలో ఉన్న ముఖ్యమంత్రి(Chief Minister) భద్రతా విభాగం అధికారులకు సమాచారం అందించారు. స్టాలిన్‌ ప్రయాణించిన విమానానికే కాకుండా చెన్నై విమానాశ్రయానికి కూడా ఈమెయిల్‌లో బాంబు బెదిరింపులు రావటంతో చెన్నై విమానాశ్రయంలో తనిఖీలు చేశారు.

ఇదికూడా చదవండి: Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్


అమెరికా పర్యటన కోసం స్టాలిన్‌, ఆయన సతీమణి దుర్గాస్టాలిన్‌, అధికారులు మంగళవారం రాత్రి 8.40 గంటలకే మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. సీఎం అధికారిక పర్యటన ప్రకారం చెన్నై నుంచి ఎమిరేట్స్‌ విమానంలో దుబాయ్‌ వెళ్లి, అక్కడి నుండి మరో విమానంలో అమెరికా వెళ్ళాల్సి ఉంది. రాత్రి 10.16 గంటలకు బయలుదేరిన ఎమిరేట్స్‌ విమానంలో స్టాలిన్‌, సతీమణి, అధికారులు ప్రయాణించారు. ఆ విమానం బయలుదేరిన అరగంట తర్వాత బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలుసుకుని అధికారులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. మంగళవారం రాత్రి 7.55 గంటలకు సీఎం స్టాలిన్‌(CM Stalin) మీనంబాక్కం ఎయిర్‌పోర్ట్‌(Meenambakkam Airport)కు రాకముందే విమానాశ్రయ డైరెక్టర్‌కు స్టాలిన్‌ ప్రయాణించనున్న విమానంలో, విమానాశ్రయంలో బాంబులు పేలుతాయని గుర్తు తెలియని వ్యక్తి ఈమెయిల్‌ చేశాడు.


ఈ సందేశాన్ని రాత్రి 10 గంటల సమయంలోనే అధికారులు గుర్తించారు. అప్పటికే స్టాలిన్‌ ప్రయాణిస్తున్న ఎమిరేట్స్‌ విమానం చాలా దూరం వెళ్లింది. దీంతో ఆ విమానం దుబాయ్‌ చేరుకునేంత వరకూ విమానాశ్రయం ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళన చెందారు. బుధవారం వేకువజాము దుబాయ్‌లో ఆ విమానం దిగిన తరువాత అక్కడి బాంబ్‌స్క్వాడ్‌ క్షుణ్ణంగా తనిఖీ చేసి బాంబులు లేవని నిర్ధారించారు. ఆ తర్వాతే అటు సీఎం సెక్యూరిటీ, ఇటు విమానాశ్రయంలోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

.


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.......................................................................

Chennai: రాష్ట్రానికి 3 రోజుల వర్షసూచన

- బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం

చెన్నై: తూర్పు మధ్య ఉత్తర బంగాళాఖాతంలో గురువారం అల్పవాయుపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల ప్రభావంతో చెదురుముదురుగా వర్షాలు కురుస్తున్నాయని, ఈ అల్పపీడనం కారణంగా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తాయని, సముద్రతీర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


గురు, శుక్రవారాల్లో పుదుచ్చేరి, కారైక్కాల్‌(Karaikkal, Puducherry) సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం ప్రకటన జారీ చేసింది. ఇక రాజధాని నగరంలో చెన్నై మరో 48 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలోను, పరిసర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2024 | 01:28 PM

Advertising
Advertising