ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: దిండివనం వద్ద పట్టాలపై పగుళ్లు

ABN, Publish Date - Dec 24 , 2024 | 10:31 AM

దిండివనం సమీపంలో రైలు పట్టాలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని ఆ మార్గంలో వెళ్తున్న పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌(Puducherry Express Loco Pilot) గుర్తించి, రైలు ఆపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది.

- పుదుచ్చేరి రైలుకు తప్పిన ముప్పు

చెన్నై: దిండివనం సమీపంలో రైలు పట్టాలపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ విషయాన్ని ఆ మార్గంలో వెళ్తున్న పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ లోకో పైలట్‌(Puducherry Express Loco Pilot) గుర్తించి, రైలు ఆపివేయడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఎగ్మూరు రైల్వేస్టేషన్‌ నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు పుదుచ్చేరి రైలు బయలుదేరింది. ఆ రైలు దిండివనం(Dindivanam) సమీపం ఓంకూర్‌ వద్ద వెళ్తుండగా రైలింజన్‌ చక్రాల కింద పెద్ద శబ్దం వినిపించింది. దీంతో లోకో పైలట్‌ బ్రేకులు వేసి రైలు నిలిపివేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: మళ్ళీ అల్పపీడనం.. మరో 5 రోజులు వర్షసూచన


కిందకు దిగి పట్టాలను పరిశీలించగా ఓ చోట పగుళ్లు కనిపించాయి. వెంటనే ఆయన రైల్వే ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. రైల్వే ఇంజనీర్లు, కార్మికులు హుటాహుటిన అక్కడికి వెళ్ళిన పట్టాలు పగిలిన చోట మరమ్మతులు చేపట్టారు. సుమారు గంట తర్వాత పట్టాల మరమ్మతులు పూర్తయ్యాయి. అప్పటివరకూ రైలులో ఉన్న ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంట తర్వాత ఆ రైలు పుదుచ్చేరి(Puducherry) వైపు బయలుదేరింది.


ఈవార్తను కూడా చదవండి: Revanth Reddy: సంక్రాంతికి వస్తున్నాం!

ఈవార్తను కూడా చదవండి: మహిళా గ్రూపులతో 231 ఎకరాల్లో సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయించండి: సీఎస్‌

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: విచారణకు రండి..

ఈవార్తను కూడా చదవండి: Cybercrime: బరితెగించిన సైబర్‌ నేరగాళ్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 24 , 2024 | 10:31 AM