Chennai: కన్నియాకుమారిలో కుండపోత..
ABN, Publish Date - May 23 , 2024 | 11:14 AM
కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో మంగళవారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం తీవ్రరూపం దాల్చి రాత్రంతా కుండపోతగా కురిసి పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది.
చెన్నై: కన్నియాకుమారి(Kanniyakumari) జిల్లాలో మంగళవారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం తీవ్రరూపం దాల్చి రాత్రంతా కుండపోతగా కురిసి పల్లపు ప్రాంతాలను ముంచెత్తింది. రహదారులలో వర్షపు నీరు వరదలా ప్రవహించింది. సాయంత్రం ఆరుగంటలకు ప్రారంభమైన వర్షాలు బుధవారం వేకువజాము వరకూ కొనసాగింది. కొట్టారంలో మంగళవారం రాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. ఆ ప్రాంతంలో 84.6 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: అమ్మకానికి చిన్నారి.. ఆర్‌ఎంపీ డాక్టర్ అరెస్ట్
మయిలాడి, నాగర్‌కోవిల్ కన్నిమార్(Mailadi, Nagercoil Kannimar), మాంబళతురైయారు, కుళిత్తురై, సురులోడు తదితర ప్రాంతాల్లోనూ చెదురుముదురుగా వర్షం కురిసింది. సేలం జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల దాకా వర్షాలు కురిశాయి. మహాత్మాగాంధీ క్రీడామైదానంలో వర్షపునీరు వరదలా ప్రవహిచింది. ఇదేవిధంగా పనమరత్తుపట్టి వద్ద భారీ వర్షాలకు అడవి వెల్లువలు రహదారులను నీటితో ముంచెత్తాయి. ఐరుగుమలై ప్రాంతంలో అడవివెల్లువలు ముంచెత్తడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 1500 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు.
ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 23 , 2024 | 11:18 AM