Chennai: జల్లికట్టు పోటీలకు మార్గదర్శకాలు విడుదల..
ABN, Publish Date - Dec 25 , 2024 | 11:00 AM
రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
చెన్నై: రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో, పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి సత్యప్రదసాహు జిల్లా కలెక్టర్లకు పంపిన లేఖలో, జల్లికట్టు మార్గదర్శకాలను సూచించారు.
ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: ద్రావిడ పాలనను అపహాయ్యం చేస్తే పెరియార్ బడిత పూజే శరణ్యం..
- జిల్లా కలెక్టర్ నుంచి ప్రాంతం, సమయం తీసుకోకుండా జల్లికట్టు పోటీలు నిర్వహించరాదు.
- జల్లికట్టు పోటీల నిర్వహణకు తగిన భద్రత కల్పించాలి.
- జల్లికట్టు పోటీల్లో పాల్గొనే ఎద్దులను హింసించరాదు.
- జల్లికట్టు పోటీలకు ముందు ఎద్దులకు పశు వైద్యుల సర్టిఫికెట్ పొందాలి.
- కొత్తగా రూపొందించిన www.jallikattu.tn.gov.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే జల్లికట్టు పోటీలకు దరఖాస్తు చేసుకోవాలి.
- జల్లికట్టు పోటీలను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలి.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2024 | 11:00 AM