ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: చెన్నై విమానాశ్రయంలో ఏడంచెల భద్రత

ABN, Publish Date - Aug 10 , 2024 | 10:43 AM

భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీని కారణంగా స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

- అడుగడుగునా తనిఖీలు

- అదుపులోకి అనుమానితులు

చెన్నై: భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నై విమానాశ్రయం(Chennai Airport)లో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. దీని కారణంగా స్వదేశీ ప్రయాణికులు గంటన్నర ముందు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మూడున్నర గంటల ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. త్రిశూలం నుంచి మీనంబాక్కం వరకు ఉన్న స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలు, కార్గో, విమానాలకు ఇంధనం నింపే ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ బృందాలు విధుల్లో పాల్గొంటున్నారు.

ఇదికూడా చదవండి: Manish Sisodia: భార్యతో సెల్ఫీ తీసుకుని.. తనదైన శైలిలో స్పందించిన మనీశ్


ఈ నెల 15న జరిగే దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడులను భగ్నం చేసేలా ఉగ్రదాడి జరిగే అవకాశముందని కేంద్ర హోంశాఖ(Central Home Ministry)కు రహస్య సమాచారం అందింది. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రజలు అధికంగ తిరిగే ప్రాంతాలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేఫథ్యంలో, చెన్నై విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఏడంచెల భద్రత ఏర్పాటుచేశారు. గడిచిన రెండు నెలల కాలంలో చెన్నై విమానాశ్రయానికి పదిసార్లు బాంబు బెదిరింపు రావడంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో ఐదంచెల భద్రత(Five-step security) కొనసాగుతోంది.


ఈ నేఫథ్యంలో, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏడంచెల భద్రత ఏర్పాటుచేశారు. విమానాశ్రయం బయట స్థానిక పోలీసులు, లోపల కేంద్ర పారిశ్రామిక బలగాలు గస్తీ చేపట్టాయి. విమానాశ్రయానికి వచ్చే వాహనాలను ప్రవేశ ద్వారం వద్దే ఆపి భద్రతా దళాలు తనిఖీ చేసిన తరువాతే లోపలికి పంపిస్తున్నారు. ప్రయాణికుల లగేజీని మెటల్‌ డిటెక్టర్లతో పరిశీలిస్తున్నారు. విమానాశ్రయ భద్రత దృష్ట్యా సందర్శకుల ప్రవేశంపై ఇప్పటికే నిషేధం విధించారు.


కానీ, ప్రముఖులు వచ్చిన సమయంలో వారికి ఆహ్వానం పలికేందుకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో వస్తుంటారు. వారికి కూడా ప్రస్తుతం కొన్ని నిబంధనలు విధించారు. విమానాశ్రయ ప్రాంగణం, పరిసరాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలుండగా, అదనపు కెమెరాలు ఏర్పాటుచేసి కంట్రోల్‌ రూమ్‌ నుంచి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. ఈ తనిఖీలు ఈ నెల 20వ తేది వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2024 | 10:43 AM

Advertising
Advertising
<