Chennai: నటి కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 10:55 AM
తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి(Kasturi)ని అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 3వ తేదీ ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
చెన్నై: తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి(Kasturi)ని అదుపులోకి తీసుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. ఈ నెల 3వ తేదీ ఎగ్మూర్ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు తెలుగు సంఘాలు కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమె ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టు(High Court)ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, కస్తూరిని అరెస్ట్ చేసేందుకు ఏర్పాటైన రెండు పోలీసు బృందాలు ఆమె కోసం గాలిస్తున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!
కస్తూరిని అరెస్ట్ చేయాలి: ద్రావిడ దేశం కృష్ణారావు
తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడిన నటి కస్తూరిని వెంటనే అరెస్ట్ చేయాలని ద్రావిడ దేశం వ్యవస్థాపకులు వి.కృష్ణారావు డిమాండ్ చేశారు. కస్తూరి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఉద్దేశించే గర్హనీయ వ్యాఖ్యలు చేశారని తెలిపారు.
అందుకే తాను మంగళవారం ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెంలో వున్న కరుణ పూర్వీకుల నివాసాన్ని సందర్శించి, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపానన్నారు. తమిళనాడులో సామాజిక న్యాయాన్ని అమలు చేసిన కరుణ గురించి చిన్న నటి కస్తూరి విమర్శించడం సరి కాదన్నారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి కస్తూరి చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన తెలిపినట్లు కృష్ణారావు పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం
ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం
ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్
Read Latest Telangana News and National News