ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh : 25 మంది నక్సలైట్ల లొంగుబాటు

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:38 AM

ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

  • వారిలో ఐదుగురిపై రూ. 28 లక్షల రివార్డు

  • ఇన్‌ఫార్మర్‌ నెపంతో యువకుడి హత్య

బీజాపూర్‌/చర్ల, ఆగస్టు26: ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో సోమవారం 25మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

వీరిలో ఐదుగురి తలలపై భారీస్థాయిలో రూ.28 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు బీజాపూర్‌ ఎస్పీ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. లొంగిపోయిన వారిలో శాంబాటి మడ్కం (23), జ్యోతిపూనెం (27)తోపాటు మహేశ్‌ తేలం ఉన్నారని, వారి ఒక్కొక్కరి తలపై రూ.8లక్షల నగదు రివార్డు ఉందన్నారు.

2012 నుంచి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న శాంబాటి మడ్కం 2020, 2021లో జరిగిన మింపా, టేకులగూడెం దాడుల్లో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆ దాడుల్లో 39మంది పోలీసులు అమరులైనట్లు తెలిపారు.

బీజాపూర్‌ జిల్లా పిడియాలో ఈ ఏడాది మేనెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జ్యోతి, మహేశ్‌ పాల్గొన్నట్లు తెలిపారు. మావోయిస్టు భావజాలం, ఉద్య మ నేతలు దౌర్జన్యాలపట్ల నిరాశతోపాటు ఇటీవల పోలీసులు ప్రవేశపెట్టిన లాల్‌వర్రాట్‌, పునరావాసం పథకాలకు ఆకర్షితులై వారు లొంగిపోయినట్లు చెప్పారు.

బీజాపూర్‌ జిల్లాలో ఇప్పటివరకు 170మంది నక్సలైట్లు లొంగిపోగా, 346 మంది అరెస్టయినట్లు ఎస్పీ తెలిపారు. కాగా, ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఛత్తీ్‌సగఢ్‌ భైరంగడ్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడిని మావోయిస్టులు హత్య చేశారు.

Updated Date - Aug 27 , 2024 | 05:38 AM

Advertising
Advertising
<