ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chhattisgarh : బస్తర్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌..

ABN, Publish Date - Sep 04 , 2024 | 04:54 AM

ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు.

  • 9 మంది నక్సల్స్‌ మృతి

చర్ల/చింతూరు, సెప్టెంబరు 3: ఛత్తీ్‌స్‌గఢ్‌లోని బస్తర్‌ అడవులు మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లాయి. బీజాపూర్‌-దంతేవాడ సరిహద్దుల్లోని లోహగావ్‌, పురంగెల్‌ కొండపై మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది నక్సల్స్‌ మృతిచెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. దంతేవాడ ఎస్పీ గౌరవ్‌రాయ్‌ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి లోహగావ్‌-పురంగెల్‌ కొండల మధ్య మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు ఉప్పందుకున్న దంతేవాడ, బీజాపూర్‌ జిల్లాల డీఆర్‌జీ పోలీసులు, బీఎ్‌సఎఫ్‌, కోబ్రా బలగాలు కూంబింగ్‌ ప్రారంభించాయి. మంగళవారం ఉదయం బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య నాలుగు గంటల పాటు కాల్పులు కొనసాగాయి. ‘‘మావోయిస్టుల వైపు కాల్పులు నిలిచిపోయిన కాసేపటికి బలగాలు ముందుకు చొచ్చుకెళ్లాయి.

తొమ్మిది మంది నక్సల్స్‌ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. వారిలో ఆరుగురు మహిళా నక్సలైట్లు. వీరంతా పీఎల్‌జీ-2 గెరిల్లా బెటాలియన్‌, దర్బా కమిటీకి చెందిన మావోయిస్టులు అని నిర్ధారించాం. ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, 303, 315 రైఫిళ్లు, ఒక డ్రెయిన్‌ గన్‌, మరొక 12-బోర్‌ గన్‌, ఒక బీజీఎల్‌, మందుపాతరలు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. పెద్దసంఖ్యలో మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకున్నారు.’’ అని గౌరవ్‌రాయ్‌ వెల్లడించారు.

  • 13 మంది మావోయిస్టుల అరెస్టు

బీజాపూర్‌జిల్లా గంగలూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తెర్రాం అడవుల్లో పోలీసులు సోమవారం 13 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. వారి నుంచి మందుగుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఐఈడీ మందుపాతర పేల్చిన ఘటనలో ఈ 13 మంది నిందితులని వెల్లడించారు.

Updated Date - Sep 04 , 2024 | 04:54 AM

Advertising
Advertising