ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి

ABN, Publish Date - Dec 21 , 2024 | 10:23 AM

మూడేళ్ల ద్రావిడ తరహా పాలన చూసి అన్ని వర్గాలవారు మెచ్చుకుంటున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పసలేని విమర్శలు చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.

- ఈరోడ్‌ సభలో ఈపీఎస్‏పై సీఎం స్టాలిన్‌ ధ్వజం

చెన్నై: మూడేళ్ల ద్రావిడ తరహా పాలన చూసి అన్ని వర్గాలవారు మెచ్చుకుంటున్నారని, రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి పసలేని విమర్శలు చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోడ్‌ నగరంలో శుక్రవారం జరిగిన సభలో ఆ జిల్లాలో రూ.951.20 కోట్లతో పూర్తయిన 559 పథకాలను ప్రారంభించి, రూ. 133,66 కోట్లతో చేపట్టనున్న 222 పథకాలకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: బ్యాంకుల్లో 443 కేజీల బంగారం డిపాజిట్‌..


వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.284.02 కోట్ల విలువైన సహాయాలను అందజేశారు. ఈ సందర్భంగా సభలో స్టాలిన్‌ మాట్లాడుతూ ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ జన్మస్థలమైన ఈరోడ్‌ సభలో పాల్గొనటం తనకెంతో ఆనందంగా ఉందని, తమిళ ప్రజలకు అన్నాదురై, కరుణానిధి వంటి రాజకీయ ప్రముఖులను పరిచయం చేసిన ఘనత పెరియార్‌కే దక్కుతుందన్నారు. పెరియార్‌ సీమలో జరిగిన సభలో పాల్గొంటున్నాననే సంతోషం కంటే, ఈరోడ్‌ శాసనసభ్యుడు, తన ఆత్మీయ మిత్రుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ ఈ సభలో లేకపోవడం తనకు శోకాన్ని కూడా కలిగిస్తోందన్నారు.


గత అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో జరిగినట్లు పథకాలను ప్రకటించి ఊరుకోవడం లేదని, శాసనసభ లోపలా, బయటా తాను ప్రకటించే ప్రతి పథకమూ సక్రమంగా అమలవుతున్నాయా? ఆ పథకాల ఫలితాలు మారుమూల గ్రామాలలోని నిరుపేదలకు అందుతున్నాయనా? అని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలను వరుసగా నెరవేరుస్తుండటాన్ని చూసి ఓర్వలేకే ఈపీఎస్‌ అసత్య ఆరోపణలతో తమ పాలనపై విమర్శలు చేస్తున్నారని స్టాలిన్‌ ధ్వజమెత్తారు.


ఇటీవలి తుఫాను వర్షాలు, అల్పపీడన ప్రభావిత వర్షాల సమయంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం వల్లే వరదలు బాగా తగ్గాయని, ప్రాణనష్టాన్ని నిరోధించగలిగామని, సాత్తనూరు డ్యామ్‌లో అదనపు జలాలను విడుదల చేయడానికి ముందు నాలుగైదుసార్లు హెచ్చరికలు చేసిన మీదటే విడుదల చేశామని, ఇవేవీ ఈపీఎస్‌ కళ్ళకు కనబడలేదన్నారు. అన్నాడీఎంకే పాలనలో చెంబరంబాక్కం జలాల విడుదల వల్ల నగరంలో ఏర్పడిన వరద పరిస్థితులను, తాము పడ్డ కష్టాలను నగరవాసులు ఎప్పటికీ మరువలేరనే సంగతి ఈపీఎస్‏కు తెలియకపోవడం గర్హనీయమన్నారు.


ప్రతిరోజూ బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాననే విషయాన్ని కూడా మరచిపోయిన ఈపీఎస్‌ తమిళ హాస్యనటుడు సెంథిల్‌, గౌండమణి అరటిపండు కామెడీలాగా పసలేని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారని స్టాలిన్‌ ఎద్దేవా చేశారు. ఎంతసేపూ డీఎంకే పాలనపైనే గగ్గోలు పెడుతున్న ఈపీఎస్‌ రాష్ట్రాభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోకుండా, నిధులు విడుదల చేయకుండా నిరంకుశ ధోరణిని ప్రదర్శిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై అరచి గగ్గోలు పెడితే రాష్ట్రానికి కాస్త ప్రయోజనం కలుగుతుందని స్టాలిన్‌ సూచించారు. రాజ్యసభలోని అన్నాడీఎంకే సభ్యులను ఆ దిశగా కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రానికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు కలిగేలా ఈపీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్టాలిన్‌ హితవు పాలికారు.


ఈరోడ్‌కు వరాల జల్లు...

ఈరోడ్‌జిల్లాను మరింతగా అభివృద్ధిపరిచేలా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సభా ముఖంగా ఎనిమిది వరాలను ప్రకటించారు. ఈ ప్రకారం ఈరోడ్‌ కార్పొరేషన్‌, అందియూరు, గోపిచెట్టిపాళయం, మొడకురిచ్చి, పెరుందురై ప్రాంతాల్లోని రహదారులను మెరుగుపరిచేందుకు, మరమ్మతుచేయడానికి రూ.100 కోట్ల మేర కేటాయించనున్నట్లు ప్రకటించారు. ఈ రోడ్‌ నగరంలో డీఎస్పీ కార్యాలయం వద్ద రూ.15.37 కోట్లతో కొత్త భవనాన్ని అగ్నిమాపక దళం కార్యాలయం కోసం రూ.8.03 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు.


ఈరోడ్‌ జిల్లాలో అద్దెభవనాలలో నడుపుతున్న 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.6.75 కోట్లతో సొంతభవనాలు నిర్మించనున్నామని, భవానీ వద్దనున్న సంగమేశ్వరాలయం, కొడుముడిలోని మకుటేశ్వర ఆలయం, వీరనారాయణ పెరుమాళ్‌ ఆలయ భక్తులకు విస్తృత సదుపాయాలు కల్పించేందుకు రూ.10 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నట్లు స్టాలిన్‌ ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ముత్తుసామి, సామినాధన్‌, అన్బిల్‌ మహేష్‌ పొయ్యామొళి, కయల్‌విళి సెల్వరాజ్‌, మదివేందన్‌, పార్లమెంట్‌ సభ్యులు అంథియూరు సెలవ్రాజ్‌, ప్రకాష్‌, సుబ్బరాయన్‌, శాసనసభ్యులు వెంకటాచలం, సరస్వతి, జిల్లా కలెక్టర్‌ రాజగోపాల్‌ సుంకర తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 10:23 AM