ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Stalin: ద్రావిడ పాలనను అపహాయ్యం చేస్తే పెరియార్ బడిత పూజే శరణ్యం..

ABN, Publish Date - Dec 25 , 2024 | 10:25 AM

రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు.

- సీఎం స్టాలిన్‌

చెన్నై: రాష్ట్రంలో ద్రావిడ తరహా పరిపాలనను అపహాస్యం చేస్తున్నవారికి ఇక ద్రవిడ ఉద్యమనేత పెరియార్‌ ఊతకర్రే తగిన విధంగా సమాధానం చెబుతుందని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) వ్యాఖ్యానించారు. పెరియార్‌ 51వ వర్థంతి సందర్భంగా వేప్పేరిలోని పెరియార్‌ థిడల్‌లో ద్రావిడ కళగం ఆధ్వర్యంలో నిర్మించిన పెరియార్‌ గ్రంథాలయ పరిశోధన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: డెల్టా జిల్లాల దిశగా అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షసూచన


ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ద్రావిడ కళగం నేత కె.వీరమణి ముఖ్యమంత్రికి పెరియార్‌ ఉపయోగించిన ఊతకర్రను బహుమానంగా అందజేశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ. తన జీవితంలో ఇప్పటి వరకు వివిధ ప్రముఖులు, సంస్థలు, సభల నుంచి అందుకున్న కానుకల కంటే పెరియార్‌ ఊతకర్ర అత్యంత విలువైన, పది కాలాలపాటు దాచుకోవాల్సిన అరుదైన కానుకగా భావిస్తున్నానన్నారు. పెరియార్‌ స్మారక స్థలానికి వస్తే పుట్టినింటికి వచ్చినంత ఆనందం కలుగుతుందన్నారు.


పెరియార్‌ కాలధర్మం చేసి ఐదు దశాబ్దాలు దాటినా, రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. పెరియార్‌ ఆశయాలను మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, కరుణానిధి ఆచరించారని, తాను కూడా ఆ మహాపురుషుల అడుగుజాడలలోనే నడుస్తున్నానని స్టాలిన్‌ పేర్కొన్నారు. ఇటీవల కేరళ(Kerala)లోని వైక్కమ్‌ వద్ద కొత్త మెరుగులు దిద్దుకున్న పెరియర్‌ స్మారక మండపాన్ని తాను ప్రారంభించినప్పుడు తనతోపాటు వచ్చిన వీరమణి పట్టరాని సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు.


ప్రస్తుతం 90వ వడిలో ఉంటూ పెరియార్‌ ఆశయాలు, సిద్ధాంతాలపై విస్తృత ప్రచారోద్యమం సాగిస్తున్న వీరమణి నిండునూరేళ్లు వర్థిల్లాలని స్టాలిన్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, పీకే శేఖర్‌బాబు, కయల్‌విళి సెల్వరాజ్‌, ఎంపీ రాజా, మేయర్‌ ఆర్‌.ప్రియ, ఎమ్మెల్యేలు తాయగం కవి, ఎ.వెట్రిఅళగన్‌, జోసెఫ్‌ సామువేల్‌, ద్రావిడ కళగం ఉపాధ్యక్షుడు కలి పూంగుండ్రన్‌, ప్రధాన కార్యదర్శి వి. అన్బురాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 10:25 AM