ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: మహారాష్ట్ర, జార్ఖాండ్‌కు కాంగ్రెస్ పరిశీలకులు

ABN, Publish Date - Nov 22 , 2024 | 07:20 PM

మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్.జి.పరమేశ్వరకు అప్పగించినట్టు ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జార్ఖాండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్ర (Maharashtra), జార్ఖాండ్‌ (Jharkhand) ఎన్నికలు ముగిసి శనివారంనాడు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నియామకాలు చేపట్టింది. ఎన్నికల అనంతర వ్యూహాలు, పొత్తులను కూడగట్టడంపై ఆ రెండు రాష్ట్రాలకు ఏఐసీసీ పరిశీలకులను నియమించింది.

Cash For Votes Row: ఖర్గే, రాహుల్‌కు వినోద్ తావ్డే పరువునష్టం నోటీసులు


మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్.జి.పరమేశ్వరకు అప్పగించినట్టు ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జార్ఖాండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు. పరిశీలకులు అవసరమైన వ్యూహాత్మక మార్గదర్శకాలు చేస్తూ, ప్రభుత్వ ఏర్పాటు, కూటమి వ్యూహాలపై కేంద్ర నాయకత్వానికి నివేదిక ఇస్తారు.


భారీ భద్రత మధ్య మరికొద్ది గంటల్లోనే కౌంటింగ్

మహారాష్ట్ర, జార్ఖాండ్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగగా, 65.02 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ-శివసేన-ఎన్‌సీపీ మహాయుతి కూటమి, కాంగ్రెస్-శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్‌పీ) మహా వికాస్ అఘాడి మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. కాగా, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 13, నవంబర్ 20న జరిగింది. తొలివిడతలో 66.65 శాతం, రెండో విడతలో 68.45 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ జార్ఖాండ్ ముక్తిమోర్చా-కాంగ్రెస్ కూటమి, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే హోరాహోరీ పోరు సాగించాయి. ఈ క్రమంలో మంగళవారంనాడు వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఇవి కూడా చదవండి...

Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు

Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు

Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 22 , 2024 | 07:20 PM