ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jairam Ramesh: హర్యానా, జమ్మూకశ్మీర్‌లో అధికారం కాంగ్రెస్‌దే

ABN, Publish Date - Sep 30 , 2024 | 03:57 PM

హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐ‌కి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైరామ్ రమేష్ వివరించారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: హర్యానా (Haryana)లోనూ, జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir)లోనూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరామ్ రమేష్ (Jairam Ramesh) అన్నారు. ఇటు హర్యానా, అటు జమ్మూకశ్మీర్‌లో ప్రధాన అంశాలు, పార్టీ వైఖరిని ఏఎన్ఐ‌కి సోమవారంనాడిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.


జై జవాన్, జైకిసాన్, జై పహెల్వాన్

''హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీపై పిడుగుపాటు పడనుంది. హర్యాలోని ప్రధాన అంశం...జై జవాన్, జై కిసాన్, జై పహెల్వాన్. అక్కడ జవాన్లు, రైతులకు అన్యాయం జరిగింది. రెజ్లర్లపై వివక్ష నడుస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ నినాదం ఇదే'' అని జైరామ్ రమేష్ తెలిపారు. రైతు రుణాల మాఫీ, 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన విధంగా కేంద్రం కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ బలంగా చెబుతోందని తెలిపారు. కనీస మద్దతుధరకు చట్టబద్ధత కల్పించాలని తాము అడుగుతున్నామని, రైతులు డిమాండ్ చేసున్నది కూడా ఇదేనని అన్నారు. రైతులు తమ డిమాండ్‌తో చేపట్టిన నిరసనల్లో 700 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ మోదీ మాత్రం తన మౌనం వీడలేదని తప్పుపట్టారు. మూడు సాగు చట్టాలను కేంద్ర వెనక్కి తీసుకుందని, అయితే ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పించడం, రైతు రుణాల మాఫీ ఇంకా అలానే ఉన్నాయన్నారు.

Maharashtra: ఆవును 'రాజ్యమాత'గా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం


జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ

జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకం తమకుందని జైరామ్ రమేష్ చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధించాల్సిన అవసరం ఉందన్నారు. పీడీపీతో ఎన్నికల పొత్తు అంశంపై మాట్లాడుతూ, 'ఇండియా కూటమి'లో పీడీపీ భాగస్వామి అని, అయితే ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని చెప్పారు. ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించే వాతావరణం ఉందన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్‌కు ఆదరణ పెరిగిందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌రకు రాష్ట్ర హోదా పునరుద్ధరణే తమ ప్రధాన డిమాండ్ అని, అందుకోసం పోరాడతామని తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఇది కూడా చదవండి..

BJP : జమిలిపై ముందుకే!

Updated Date - Sep 30 , 2024 | 03:57 PM