PM Modi: 'ఆర్థిక అశాంతి'కి కాంగ్రెస్ కుట్ర.. విరుచుకుపడిన ప్రధాని
ABN, Publish Date - Jul 02 , 2024 | 09:11 PM
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కాని ఆర్థిక చర్యలతో దేశంలో 'ఆర్థిక అశాంతి' నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తోందని తప్పుపట్టారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రయోజనకారి కాని ఆర్థిక చర్యలతో (uneconomic steps) దేశంలో 'ఆర్థిక అశాంతి' (uneconomic) నెలకొనేందుకు కుట్ర చేస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ చేస్తోందని తప్పుపట్టారు. ఎన్నికల సమయాల్లో చేస్తున్న వాళ్లు చేస్తున్న వాగ్దానాలు, ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినప్పుడు తీసుకుంటున్న చర్యలతో దేశం 'ఆర్థిక అశాంతి' వైపుకి వెళ్తుందన్నారు. కాంగ్రెస్ కుట్ర వల్ల ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశానికి ఆర్థిక భారంగా మారుతాయని చెప్పారు.
PM Modi: పేపర్ లీకేజీ నిందితులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ
దేశంలో అశాంతి..
లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల ఫలితాలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా రాకుంటే దేశంలో అశాంతిని సృష్టిస్తామని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ప్రకటించిందని మోదీ అన్నారు. అశాంతిని విస్తరింపజేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు. ''దేశ ఎన్నికల ప్రక్రియను ప్రశ్నించడం ద్వారా అంశాతిని సృష్టించేందుకు ప్రయత్నించారు. సీఏఏ విషయంలోనూ ఇదే చేశారు. ప్రజల్లో అపోహలు తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అల్లర్లలో వారి ప్రమేయం ఏమిటో దేశ ప్రజలంతా కూడా చూశారు'' అంటూ కాంగ్రెస్ పార్టీ తీరును ప్రధాని ఎండగట్టారు.
Read Latest National News and Telugu News
Updated Date - Jul 02 , 2024 | 09:16 PM