LokSabha Elections: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
ABN, Publish Date - Jun 07 , 2024 | 05:06 PM
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్‌సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
న్యూఢిల్లీ, జూన్ 06: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలకు గెలుచుకుంది. అయితే మహారాష్ట్ర సింగ్లి లోక్‌సభ సభ్యుడు విశాల్ పాటిల్.. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆ పార్టీ లోక్‌సభ సభ్యుల సంఖ్య 100కి పెరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ పదేళ్లలో 100 స్థానాలను కూడా గెలుచుకో లేక పోయిందంటూ.. ప్రధాని మోదీతోపాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలకు.. ఈ ఘటనతో ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.
2014, 2019, 2024 ఎన్నికల్లో బీజేపీ చాలా సీట్లు గెలుచుకున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం 100 సీట్లలో కూడా విజయం సాధించలేకపోయిందంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇండియా కూటమి గతంలో.. చాలా నెమ్మదిగా మునిగిపోతున్న నావ అని.. అయితే ప్రస్తుతం ఆ కూటమి వేగంగా మునిపోతున్న నావ అంటూ ఆయన అభివర్ణించారు. ఆ కొద్ది రోజులకే ఓ ఎంపీ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం.
దీంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య వందకు చేరింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 328 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే 99 మంది మాత్రమే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతోపాటు ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్య బాణాలు సంధించారు. మరోవైపు గత 15 ఏళ్లలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలు అత్యుత్తమైనవని పలువురు రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 2014లో 44 స్థానాలు, 2019లో 52 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విశాల్ పాటిల్.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంతదాదా పాటిల్ మనవడు.
Also Read: Nara Lokesh: టీడీపీ ఎప్పుడు ‘ఆ పని’ చేయదు..
Also Read: మోదీ ఆరోపణలు.. కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
Also Read: అద్వానీ, జోషిల నుంచి ఆశీర్వాదం తీసుకున్న మోదీ
Also Read: నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మృతి
Also Read: బాలీవుడ్ మౌనంపై కంగనా రనౌత్ స్పందన
For Latest News and National News click here
Updated Date - Jun 07 , 2024 | 07:14 PM