Jharkhand Elections: కాంగ్రెస్, జేఎంఎం ఉమ్మడి మేనిఫెస్టో.. హైలైట్స్ ఇవే
ABN, Publish Date - Nov 05 , 2024 | 07:39 PM
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.
రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM), కాంగ్రెస్ (Congress), ఆర్జేడీ (RJD), సీపీఎం (CPM) కూటమి ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto)ను మంగళవారంనాడు విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జార్ఖాండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ మేనిఫోస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడు ప్రధాన హామీలతో ఈ జాబితాను విడుదల చేశారు. మహా ఘట్ బంధన్ కూటమి అధికారంలోకి రాగానే తమ ప్రాధాన్యతా క్రమాల్లో ఇవి కీలకమని నాయకులు ప్రకటించారు.
US Elections 2024: కమలా హారిస్ గెలుపు కోసం స్వగ్రామంలో ప్రత్యేక పూజలు
ఎన్నికల్లో ఎందుకు తమ పార్టీకి ఓటు వేయాలనేది ప్రజలకు ఆయా పార్టీలు వివరించాల్సి ఉంటుందని, తమ కూటమి ప్రధానంగా 7 గ్యారెంటీలతో ప్రజల ముందుకు వస్తోందని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని ఖర్గే, హేమంత్ సోరెన్ తెలిపారు.
హామీలివే..
1. సర్న రెలిజయన్ కోడ్ అమలుతో పాటు లోకల్ పర్సనల్ బిల్... 1932 ఖటియాన్ బేస్డ్ లోకల్ బిల్లు అమలు.
2. ఈ ఏడాది డిసెంబర్ నుంచి Maiya Sammn Scheme కింద రూ.2,500 అందించడం.
3. వెనుకబడిన వర్గాల కమిషన్ ఏర్పాటు ద్వారా మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ.
4. ఒక్కో కుటుంబానికి రూ.450కే ఎల్‌పీజీ గ్యాస్, ఒక్కొక్కరికి రేషన్ 7 కిలోలకు పెంపు
5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ.15 లక్షల వరకూ కుటుంబ ఆరోగ్య బీమా
6. ప్రతి బ్లాక్‌లోనూ డిగ్రీ కాలేజీలు, ప్రచి జిల్లాలోనూ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్శిటీలు, 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
7.కనీస మద్దతు ధర రూ.2,400 నుంచి రూ.3,200కు పెంపు, ఇతర పంటలపై 50 శాతం పెంపు.
Also Read:
ఐదుగురు రెబల్స్‌పై ఉద్ధవ్ థాకరే వేటు
ఎన్నికల్లో పోటీపై శరద్ పవార్ సంచలన ప్రకటన
మదర్సాలపై కీలక తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు..
For More National and telugu News
Updated Date - Nov 05 , 2024 | 07:39 PM