Haryana Assembly Elections: బీజేపీపై గెలుపునకు కాంగ్రెస్ వినూత్న ప్రచారం
ABN, Publish Date - Sep 01 , 2024 | 08:05 AM
హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ‘ఖర్చే పే చర్చ’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. బీజేపీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల ‘చాయ్ పే చర్చ’ పేరిట రేడియోలో ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.
ఛండీగఢ్, సెప్టెంబర్ 01: హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ.. కాంగ్రెస్ పార్టీ వినూత్న ప్రచారానికి తెర తీసింది. ‘ఖర్చే పే చర్చ’ పేరిట ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ శ్రీకారం చుట్టింది. బీజేపీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ తరహా ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల ‘చాయ్ పే చర్చ’ పేరిట రేడియోలో ప్రసంగిస్తున్న సంగతి తెలిసిందే.
అందులోభాగంగా ప్రతి నెల వివిధ అంశాలపై ఈ చాయ్ పే చర్చలో భాగంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ పాలనలో ధరలు ఏ విధంగా ఉన్నాయి... అలాగే తమ పార్టీ పాలనలో ధరలు ఎలా ఉన్నాయనే అంశాలను ప్రస్తావిస్తూ.. ఈ తరహా ప్రచారాన్ని క్షేత్రస్థాయిలోని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చర్యలు చేపట్టింది. దశాబ్ద కాలంగా బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెరిగిన ధరలను ఈ సందర్బంగా పట్టిక రూపంలో రూపొందించి.. ప్రజల మధ్యకు ఆ పార్టీ వెళ్తుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోని ప్రధాన కూడళ్ల వద్ద ఈ పట్టికలను ఏర్పాటు చేస్తుంది.
మరోవైపు హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీని ఆక్టోబర్ 5వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం మార్చిన విషయం విధితమే. అసలు అయితే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతోపాటు హరియాణా అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతాయని.. హరియాణా అసెంబ్లీ ఎన్నికలు ఒక విడతలో జరుగుతాయని ఎన్నికల సంఘం ఇప్పటికే జారీ చేసిన షెడ్యూల్‌లో వెల్లడించింది.
ఈ ఏడాది ఆక్టోబర్ 2వ తేదీన బిష్ణోయ్ సామాజిక వర్గం వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్, హరియాణాలోని ఆ వర్గం వారు ఆ వేడుకల్లో భారీ సంఖ్యలో పాల్గొంటారు. దీంతో ఆక్టోబర్ 1వ తేదీ పోలింగ్ కారణంగా.. ఈ వేడుకలపై ఆ ప్రభావం పడుతుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ సామాజిక వర్గం పెద్దలు లేఖ రాశారు.
దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆ క్రమంలో హరియాణ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఆక్టోబర్ 5వ తేదీకి మార్చింది. అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఆక్టోబర్ 8వ తేదీకి మార్చింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికలతోపాటు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును అదే రోజు చేపట్టనున్నారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Sep 01 , 2024 | 08:06 AM