ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Shashi Tharoor: బీజేపీ 300 కూడా దాటదు.. 400 ఒక జోక్

ABN, Publish Date - May 02 , 2024 | 04:27 PM

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Shashi Tharoor said BJP will not even cross 300 seates 400 joke

ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలో ఈసారి 400కు పైగా సీట్లు గెల్చుకుంటామని బీజేపీ(BJP) చెబుతోంది. మరోవైపు ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు కూడా తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత శశి థరూర్(Shashi Tharoor) లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.


బీజేపీ 400 సీట్లు గెల్చుకుంటుందని చెప్పడం హాస్యాస్పదమని(joke) ఆయన అన్నారు. ఈ క్రమంలో అసలు 300 దాటడమే కష్టమని తెలిపారు. 200 సీట్లు గెల్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి సీట్లు రావని, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పేలవ ప్రదర్శన కనబరుస్తుందని శశి థరూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు 2019 కంటే మెరుగ్గా ఉందని వెల్లడించారు.


ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ చూస్తుంటే ఈసారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని శశి థరూర్ చెప్పారు. ఈ సమయంలో ఊహించిన దానికంటే మరింత ముందంజలో ఉన్నామని తెలిపారు. సుదీర్ఘంగా సాగే ఈ ఎన్నికల్లో ఇంకా ఐదు దశలు మిగిలి ఉన్నాయని, కాంగ్రెస్ విజయావకాశాలు పెరుగుతున్నాయన్నారని అన్నారు. బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం ఈసారి మెజారిటీని కోల్పోతుందన్నారు.


గత పదేళ్లలో భారత జనాభాలో 80 శాతం మంది ఆదాయం తగ్గిపోయిందని ఆర్థికవేత్తలందరూ చెబుతున్నారని శశి థరూర్ ప్రస్తావించారు. ఈ క్రమంలో 80 శాతం మంది తమను సంక్షోభంలోకి నెట్టిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటారని ఆయన అన్నారు. ప్రస్తుతం శశి థరూర్ కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను రంగంలోకి దింపింది. సీపీఐ నుంచి కేపీ రవీంద్రన్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.


ఇది కూడా చదవండి:

Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం

For Latest News and National News click here

Updated Date - May 02 , 2024 | 04:49 PM

Advertising
Advertising