ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఆ హీరోని చంపింది కసబ్ కాదు.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, Publish Date - May 05 , 2024 | 06:46 PM

యావత్ భారతదేశాన్ని కుదిపేసిన ‘26/11 ముంబై ఉగ్రదాడి’ సమయంలో యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే అమరులైన విషయం తెలిసిందే. అయితే.. ఆయన్ను హతమార్చింది..

యావత్ భారతదేశాన్ని కుదిపేసిన ‘26/11 ముంబై ఉగ్రదాడి’ (26/11 Mumbai Attacks) సమయంలో యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే (Hemant Karkare) అమరులైన విషయం తెలిసిందే. అయితే.. ఆయన్ను హతమార్చింది తీవ్రవాది అజ్మల్ కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న పోలీస్ అధికారి అని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్‌రావ్ వాడెట్టివార్ (Vijay Namdevrao Wadettiwar) సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్‌పై (Ujwal Nikam) విమర్శలు గుప్పించారు.


‘‘బిర్యానీ ప్రస్తావన తీసుకొచ్చి నికమ్ కాంగ్రెస్ పార్టీ పరువు తీశాడు. అసలు కసబ్‌కి ఎవరైనా బిర్యానీ ఇస్తారా? ఈ విషయాన్ని నికమ్ ఆ తర్వాత ఒప్పుకున్నాడు. అసలు అతను ఎలాంటి లాయర్? కోర్టులో సాక్ష్యం కూడా చెప్పని దోశద్రోహి అతను. ముంబై పోలీస్ అధికారి హేమంత్‌ను బలిగొన్న బుల్లెట్.. కసబ్ తుపాకీ నుంచి వచ్చింది కాదు, ఆర్ఎస్ఎస్ విధేయుడైన ఓ పోలీస్ అధికారి నుంచి. ఈ సత్యాన్ని దాచిపెట్టిన ద్రోహికి బీజేపి టికెట్ ఇస్టుంటే, ఇలాంటి ద్రోహుల్ని ఆ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తోందా? అనే ప్రశ్న తలెత్తుతోంది?’’ అని విజయ్ నామ్‌దేవ్‌రావ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కాగా.. అజ్మల్ కసబ్‌కు మరణశిక్ష పడిన 26/11 ఉగ్రదాడి విచారణలో ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్.

ఈసీ కీలక ప్రకటన.. ఆ ఓటర్లకు మరో అవకాశం

మరోవైపు.. విజయ్ నామ్‌దేవ్‌రావ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ తన ప్రత్యేక ఓటు బ్యాంక్‌ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతకైనా దిగజారుతుందని విజయ్ వాడెట్టివార్ వ్యాఖ్యలు మరోసారి నిరూపితమైంది. ఆయన ఉద్దేశంలో.. హేమంత్‌ను కసబ్ చంపలేదట. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌కు సిగ్గు లేదా? దీన్ని బట్టి.. ఎన్నికల్లో కాంగ్రెస్, యువరాజు గెలవాలని పాకిస్తాన్ ఎందుకు ప్రార్థిస్తుందో అర్థం చేసుకోవచ్చు’’ అని అన్నారు. ఇలా తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. ఆ వ్యాఖ్యలు తనవి కావని, ఎస్ఎం ముష్రీఫ్ రాసిన ‘హూ కిల్డ్ కర్కరే’ పుస్తకంలో రాసిన సమాచారాన్నే తాను చెప్పానని వాడెట్టివార్ వివరణ ఇచ్చారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 05 , 2024 | 06:46 PM

Advertising
Advertising