Rahul Gandhi: రాహుల్ గాంధీ 'ఫేక్ వీడియో'.. పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
ABN, Publish Date - Apr 27 , 2024 | 08:00 AM
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది.
వాయనాడ్(wayanad) పార్టీ యూనిట్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'ఫేక్ వీడియో(fake video)'పై కాంగ్రెస్ పార్టీ వయనాడ్ జిల్లా కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేశంలోని మత సామరస్యాన్ని ధ్వంసం చేయడం, పార్టీని ప్రతికూలంగా చిత్రీకరించడమే లక్ష్యంగా ఈ వీడియో ఉందని పార్టీ పేర్కొంది. ఫిర్యాదుతో పాటు వీడియో కాపీని కూడా పార్టీ షేర్ చేసింది. వీడియో తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేసింది. అంతేకాదు సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించాలని కూడా తెలిపింది.
ఆ వీడియో సమాజంలో కాంగ్రెస్ పార్టీని(congress party) ప్రతికూలంగా చిత్రీకరించడానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించిన వీడియో అని కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ నేపథ్యంలో వీడియో సృష్టికర్తలను గుర్తించి, వారి నుంచి వీడియోను తీసుకుని, చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన రెండో విడతలో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన ఈ నియోజకవర్గం నుంచి రెండోసారి పార్లమెంట్‌కు పోటీ చేశారు. ఇక ఇదే నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి పోటీగా సీపీఐ నుంచి అన్నీ రాజా, బీజేపీ నుంచి కే సురేంద్రన్ బరిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి:
BJP: కమలం ఆశల రేకులు హ్యాట్రిక్ కొట్టి రికార్డు సాధించడంపై బీజేపీ గురి.. మోదీ ఆకర్షణే బలం..
Delhi: మీకు ప్రజల కంటే రాజకీయ ప్రయోజనాలే ఎక్కువయ్యాయి
Read Latest National News and Telugu News
Updated Date - Apr 27 , 2024 | 08:02 AM