కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress: కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యుహకర్త దూరం..?

ABN, Publish Date - Jan 12 , 2024 | 04:33 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు అండ్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అనూహ్య విజయం సాధించింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పని చేశారు. లోక్ సభ ఎన్నికలకు పనిచేస్తారని అంతా భావించారు. సునీల్ కనుగోలు పనిచేయడం లేదని విశ్వసనీయంగా తెలిసింది.

 Congress: కాంగ్రెస్‌ పార్టీకి మరో వ్యుహకర్త దూరం..?

న్యూఢిల్లీ: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీల విజయాన్ని వ్యుహకర్తలు (Strategist) డిసైడ్ చేస్తున్నారు. ఎన్నికల క్యాంపెయిన్, స్లోగన్స్, హామీలను రాసి ఇస్తారు. ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) వల్ల 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. తర్వాత బెంగాల్‌లో టీఎంసీ, ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి పీకే పనిచేసిన రిజల్ట్ రాలేదు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు (Sunil Kanugolu) అండ్ టీమ్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అనూహ్యంగా విజయం సాధించింది. తర్వాత తెలంగాణలో సునీల్ కనుగోలు పనిచేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. లోక్ సభ ఎన్నికలకు పనిచేస్తారని అంతా భావించారు. సునీల్ కనుగోలు పనిచేయడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు గల కారణం మాత్రం తెలియరాలేదు. త్వరలో జరిగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలకు మాత్రం పనిచేస్తారని సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల కోసం మాత్రమే వ్యుహకర్త సునీల్ కనుగోలు సేవలను తీసుకుంటున్నారు. ఇదివరకు కర్ణాటక, తెలంగాణలో పనిచేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో పనిచేస్తారని తెలిసింది. లోక్ సభ ఎన్నికల గురించి మాత్రం ఆలోచించడం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 04:57 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising