Rahul Gandhi Birthday: రాహుల్‌కి శుభాకాంక్షల వెల్లువ.. ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించిన ఖర్గే, స్టాలిన్, ప్రియాంక
ABN, Publish Date - Jun 19 , 2024 | 12:40 PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi Birthday) బుధవారం 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్(Rahul Gandhi Birthday) బుధవారం 54వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు.
'రాహుల్.. మీ నిబద్ధత, నిజాయతీ, ప్రజలకు మేలు చేయాలన్న మీ తపన ఎంతో మెచ్చుకోదగ్గది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కన్నీరు తుడవడానికి మీరెప్పుడూ ముందుటారు. ఈ మిషన్ ఇలాగే కొనసాగాలి. భిన్నత్వం, సామరస్యం, కరుణ అనేది కాంగ్రెస్ పార్టీ తత్వం. ఇవన్నీ మీ పనుల్లో కనిపిస్తాయి. సడలని పట్టుదలతో రాజ్యాంగ పరిరక్షణ కోసం మీరు పోరాడారు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా'అని ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
'ప్రియమైన సోదరుడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మన దేశ ప్రజల పట్ల మీకున్న అంకితభావం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. మీరు నిరంతర పురోగతి సాధిస్తూ.. విజయం మీ కేరాఫ్ కావాలని కోరుకుంటున్నా' అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. 'నా ప్రియమైన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. రాహుల్ నా స్నేహితుడు, నా తోటి యాత్రికుడు, మార్గదర్శి, తత్వవేత్త, గొప్ప నాయకుడు' అని ప్రియాంక గాంధీ ప్రశంసించారు.
విద్వేశానికి వ్యతిరేకంగా నిలబడ్డ నేత..
రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో సుదీర్ఘ పోస్ట్ చేసింది.కోపం, ద్వేషం, కన్నీళ్లకు వ్యతిరేకంగా నిలబడ్డ నేత, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడిన వ్యక్తి, వెలుతురు చిందిస్తూ ఆశను రేపాడని పోస్ట్‌లో పేర్కొంది.
Rahul Gandhi Birthday: అనుమానాల నుంచి నమ్మకం వరకు.. స్ఫూర్తిదాయకం.. రాహుల్ రాజకీయ ప్రయాణం
For Latest News and National News click here
Updated Date - Jun 19 , 2024 | 12:47 PM