ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress VS BJP: యూ అంటే యూటర్న్.. మోదీ ప్రభుత్వంపై ఖర్గే సెటైర్లు..

ABN, Publish Date - Aug 25 , 2024 | 06:35 PM

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Modi and Kharge

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దేశ పురోగతి కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను చూసి గర్వపడుతున్నామన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన యునిఫైడ్ పెన్షన్ స్కీమ్(యుపిఎస్) ఉద్యోగుల సంక్షేమం, సురక్షితమైన భవిష్యత్తు పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతను చూపుతుందన్నారు. ఉద్యోగుల భవిష్యత్తుకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని ప్రధాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. యూపీఎస్‌లో యూ అంటే మోదీ ప్రభుత్వ యూటర్న్ అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధికార అహంకారాన్ని జూన్4న దేశ ప్రజలు మట్టుబెట్టారని, అప్పటినుంచి ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటుందని ఖర్గే విమర్శించారు.

PM Modi: మహిళలపై నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం


ఖర్గే ఏమన్నారంటే..

ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్)పథకంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. యూపీఎస్‌లో యూ అంటే మోడీ ప్రభుత్వం యూ టర్న్‌ అని ఖర్గే వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత విపక్షాలు బలం పుంజుకోవడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తన ప్రధాన నిర్ణయాల నుంచి వెనక్కి తగ్గడం ప్రారంభించిందని ఖర్గే తెలిపారు.

Premalatha: విజయ్‌ అనేక సవాళ్లను అధిగమించాలి..


జూన్ 4 తర్వాత ప్రధాని దురహంకారానికి జనం అడ్డుకట్ట వేశారన్నారు. తమ నిరసనల ద్వారా మోడీ ప్రభుత్వం దీర్ఘకాలిక మూలధన లాభాలు/సూచికకు సంబంధించి బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవడం, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ బిల్లును పంపడం, డ్రాఫ్ట్ బ్రాడ్‌కాస్టింగ్ బిల్లును ఉపసంహరించుకోవడం, బ్యూరోక్రసీలో పార్శ్వ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ నిరంకుశ ప్రభుత్వం నుంచి 140 కోట్ల మంది భారతీయులను రక్షించడంతోపాటు జవాబుదారీతనాన్ని కొనసాగిస్తామని ఖర్గే ఈ సందర్భంగా తెలిపారు.


Tamilisai: ఆధ్యాత్మికం లేకుండా రాజకీయం లేదు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 25 , 2024 | 06:35 PM

Advertising
Advertising
<