Exit poll Debates: కాంగ్రెస్ యూ-టర్న్, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు సై...
ABN, Publish Date - Jun 01 , 2024 | 05:59 PM
ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ''యూ-టర్న్'' తీసుకుంది. ఎగ్జిట్ బేల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ చర్చలకు (Exit poll Debates) దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ''యూ-టర్న్'' తీసుకుంది. ఎగ్జిట్ బేల్ డిబేట్స్‌లో పాల్గొంటున్నట్టు శనివారం సాయంత్రం ప్రకటించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం జరిగిన 'ఇండియా కూటమి' సమావేశంలో 'ఎగ్జిట్ పోల్ డిబేట్' అంశం కూడా చర్చ జరిగింది. డిబేట్‌లో పాల్గొనాలని కూటమి ఏకాభిప్రాయానికి వచ్చింది. దీంతో ఎగ్జిట్ పోల్ డిబేట్స్‌లో తాము పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. దీనికి ముందు ఎగ్జిట్ పోల్ డిబేట్స్‌కు తాము దూరంగా ఉంటున్ననట్టు కాంగ్రెస్ శుక్రవారం సాయంత్రం ప్రకటించింది.
బీజేపీని ఎండగట్టేందుకే...
కాగా, ఎగ్జిట్ పోల్ డిబేట్‌లో పాల్గొనాలని తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ అధికారి ప్రతినిధి తాజాగా ప్రకటించారు. బీజేపీ, ఆ పార్టీ 'ఎకోసిస్టమ్'ను ఎండగట్టేందుకు ఇండియా కూటమి పార్టీలు ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్టు చెప్పారు. శనివారం సాయంత్రం జరిగే ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌లో ఇండియా కూటమి పార్టీలన్నీ పాల్గొంటాయని చెప్పారు. 7వ దశ పోలింగ్ సాయంత్రం పూర్తి కాగానే 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.
Updated Date - Jun 01 , 2024 | 05:59 PM