Haryana Elections: ఆప్ నిర్ణయం బీజేపీకి కలిసొస్తుందా..
ABN, Publish Date - Sep 10 , 2024 | 09:26 AM
ఆమ్‌ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని ప్రచారం జరిగింది. రెండు పార్టీలు కలిసిపోటీ చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి. కానీ నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతున్న కొద్ది హర్యానా రాజకీయాలు..
హర్యానాలో రోజురోజుకి రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. గెలుపుపై ఇండియా, ఎన్డీయే కూటమిలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నా.. ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందువరకు హర్యానాలో బీజేపీ కూటమి అధికారంలోకి రావడం కొంచెం కష్టమని ఓపీనియన్ పోల్స్ అంచనావేశాయి. ముఖ్యంగా జాట్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువుగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుండటంతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనావేశారు. మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుందని ప్రచారం జరిగింది. రెండు పార్టీలు కలిసిపోటీ చేయాలని నిర్ణయించాయి. దీంతో ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందనే అంచనాలు మరింత పెరిగాయి. కానీ నామినేషన్ల స్వీకరణ గడువు దగ్గరపడుతున్న కొద్ది హర్యానా రాజకీయాలు మారిపోతున్నాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ముగియడానికి రెండు రోజుల ముందు ఆప్ కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. తాము ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించడంతో పాటు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఆప్ నిర్ణయం బీజేపీకి కలిసొస్తుందనే చర్చ జరుగుతోంది.
PM Modi : యూఏఈ అణుశక్తికి భారత్ సహకారం
బీజేపీకి కలిసొస్తుందా..
హర్యానాలో కుల రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా సగానికి పైగా నియోజకవర్గాల్లో జాట్ సామాజికవర్గం గెలుపోటములను నిర్ణయిస్తుంది. జాట్‌ల ఓట్లు ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అధికారానికి అవసరమైన మెజార్టీ సాధించే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జాట్ ఓటర్లు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చారనే విషయం స్పష్టంగా కనిపించింది. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో ఇండియ కూటమి వైపు అధికశాతం జాట్ ఓటర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. అయితే పార్టీల మధ్య ఓట్ల చీలితే మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. నిన్నటివరకు కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేస్తాయని ప్రచారం జరిగింది. దీంతో జాట్ ఓటర్ల ఓట్లు చీలకుండా ఇండియా కూటమికి పడతాయని భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఆప్ విడిగా పోటీచేస్తే మాత్రం జాట్ సామాజికవర్గం ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. హర్యానా ఢిల్లీకి సమీపంలో ఉంటుంది. దీంతో హర్యానాలోని పట్టణ ప్రాంతంలో ఆప్‌కు కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తే కూటమికి పడాల్సిన ఓట్లు.. చీలిపోయి ఆప్‌కు పడితే ఇండియా కూటమి నష్టపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rahul Gandhi : తెలుగు భాష కాదు.. చరిత్ర
సీట్ల పంపకంలో కుదరని ఏకాభిప్రాయం..
హర్యానాలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఒకే దశలో ఎన్నికల నిర్వహణ కోసం సెప్టెంబర్5వ తేదీన నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల12తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. 90 నియోజకవర్గాలకు అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్8న ఓట్లు లెక్కిస్తారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీచేస్తారనే చర్చ జరిగింది. పొత్తుల చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఆప్ 20 మంది అభ్యర్థులతో తమ తొలిజాబితాను ప్రకటించింది. వీటిలో ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన 11 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని ఆప్ తెలిపింది. 90 సీట్లలో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఆప్ నిర్ణయం కాంగ్రెస్‌కు నష్టం చేస్తుందని.. బీజేపీ కొంతమేర లాభం చేకూరుస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. నామినేషన్ల స్వీకరణకు రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆప్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది. పొత్తులో భాగంగా ఆమ్‌ఆద్మీ 10 స్థానాలను అడగగా.. ఐదు సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆప్ పొత్తుకు అంగీకరించలేదు. దీంతో ఒంటరిగా పోటీచేసేందుకు ఆప్ రెడీ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News Click Here
Updated Date - Sep 10 , 2024 | 09:26 AM