ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: అదే జరిగితే రాహుల్ వెనక్కి తగ్గడం మంచిది... పీకే సలహా

ABN, Publish Date - Apr 07 , 2024 | 09:14 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఆశించని విధంగా ఫలితాలు రాకపోతే వెనక్కి తగ్గే విషయాన్ని రాహుల్ గాంధీ పరిశీలించాలని సూచించారు.

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సలహా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఆశించని విధంగా ఫలితాలు రాకపోతే వెనక్కి తగ్గే (Step back) విషయాన్ని రాహుల్ గాంధీ పరిశీలించాలని సూచించారు. ఆచరణాత్మక ప్రయోజనాల కోసం రాహుల్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారని, గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి మేలు జరగనప్పటికీ ఆయన పక్కకు తప్పుకోవడం కానీ, పార్టీని నడిపించే అవకాశం మరొకరికి ఇవ్వడం కానీ చేయడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమనేది తన అభిప్రాయమని స్పష్టం చేశారు.


''ఎలాంటి విజయం లేకుండా పదేళ్లుగా పనిచేస్తున్న మీరు (రాహుల్) విరామం తీసుకుంటే నష్టం లేదు. వేరొకరికి ఐదేళ్లు ఛాన్స్ ఇవ్వండి. మీ అమ్మగారు (సోనియాగాంధీ) అదే చేశారు'' అని కిషోర్ అన్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం సోనియాగాంధీ రాజకీయాలకు దూరంగా ఉండి 1991లో పీవీ నరసింహారావుకు పార్టీ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని ప్రశాంత్ కిషోర్ గుర్తుచేశారు.

బీజేపీని ఓడిస్తాం.. గెలుపు మాదే


తనకే అన్నీ తెలుసునని అనుకుంటారు...

రాహుల్ గాంధీ తనకు అన్నీ తెలుసునని అనుకుంటారని, అయితే ఇతరుల సాయం అవసరమని ఆయన గ్రహించకపోతే ఎవరూ వచ్చి సహాయం చేయలేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తాను అనుకున్నది ఇతరులు అమలు చేయాలని ఆయన కోరుకుంటే అది సాధ్యమయ్యే పనికాదని వ్యాఖ్యానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి పదవి నుంచి తప్పుకున్న రాహుల్ గాంధీ ఇతరులకు అవకాశం ఇస్తారనే సందేశం ఇచ్చినప్పటికీ ఆ పని చేయలేదన్నారు. ఫలానా వారి అనుమతి లేకుండా పార్టీలో కానీ, కనీసం ఒక సీటు విషయంలో కానీ, భాగస్వామ్య పార్టీలతో సీట్ల షేరింగ్ విషయంలో కానీ సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కాంగ్రెస్ నేతలే ప్రైవేటుగా చెబుతుంటారని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 07 , 2024 | 09:14 PM

Advertising
Advertising