POSCO Case: బెంగళూరుకు తిరిగొచ్చిన యడియూరప్ప.. లైంగిక వేధింపుల కేసుపై రియాక్షన్
ABN, Publish Date - Jun 15 , 2024 | 03:48 PM
లైంగిక వేధింపుల ఆరోపణల కింద తనపై నమోదైన 'పోక్సో'కేసుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఇదంతా అనవసర గందరగోళాన్ని సృష్టించేందుకు జరుగుతున్నదేనని, ఈనెల17న తాను విచారణకు హాజరవుతానని చెప్పారు.
బెంగళూరు: లైంగిక వేధింపుల ఆరోపణల కింద తనపై నమోదైన 'పోక్సో' (POSCO) కేసుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) స్పందించారు. ఇదంతా అనవసర గందరగోళాన్ని సృష్టించేందుకు జరుగుతున్నదేనని, ఈనెల17న తాను విచారణకు హాజరవుతానని చెప్పారు. సీఐడీ జారీ చేసిన నాన్‌బెయిలబుల్ వారెంట్‌పై కర్ణాటక హైకోర్టు శుక్రవారంనాడు 'స్టే' ఇవ్వడంతో యడియూరప్ప తిరిగి శనివారంనాడు బెంగళూరుకు చేరుకున్నారు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ వెళ్లా..
బెంగళూరు విమానాశ్రయంలో యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, తాను ముందస్తు షెడ్యూల్‌లో భాగంగానే ఢిల్లీ వెళ్లినట్టు చెప్పారు. ఈనెల 17న విచారణకు హాజరవుతానని కూడా తాను ముందే సమాచారం ఇచ్చానని, హైకోర్టు ఇంజక్షన్ కూడా ఇచ్చిందని తెలిపారు. సోమవారం విచారణకు విచారణకు వస్తానని చెప్పినా కూడా అనవసరం గందరగోళం సృష్టించే ప్రయత్నం జరిగిందన్నారు. అయితే తాను ఎవరినీ తప్పుపట్టడం లేదని, కాలమే అన్నింటినీ నిర్ణయిస్తుందని, నిజం ఏమిటో ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తనకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మాయోపాయాలు చేసేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పరోక్షంగా ప్రభుత్వాన్ని విమర్శించారు.
Bangalore: సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు ఉండాలిగా..
కేసు ఇదే..
తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక దాడి చేసినట్టు మైనర్ బాలిక తల్లి గత మార్చిలో బెంగళూరు సదాశివనగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి సోదరుడు యడియూరప్పపై కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పోక్సో చట్టం కింద యడియూరప్పపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను బెంగళూరు కోర్టు గత గురువారంనాడు జారీ చేసింది. దీనిపై యడియూరప్ప తరఫున ఆయన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న విచారణ ముందుకు యడియూరప్ప హాజరవుతున్నందున అంతవరకూ అరెస్టు చేయరాదని హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో యడియూరప్ప ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.
Read Latest Telangana News and National News
Updated Date - Jun 15 , 2024 | 03:48 PM