డిజిటల్ అరెస్టు అని సైబర్ పోలీసుకే ఫోన్
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:05 AM
సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వీడియో కాల్స్ చేసి.. ‘మీరు మనీలాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు.
న్యూఢిల్లీ, నవంబరు 15: సైబర్ నేరగాళ్లు ఈ మధ్య వీడియో కాల్స్ చేసి.. ‘మీరు మనీలాండరింగ్ కుంభకోణంలో ఇరుక్కున్నారు. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అని చెప్పి బెంబేలెత్తించి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్న కేసులు బాగా వెలుగుచూస్తున్నాయి. ఇలానే ఓ సైబర్ నేరగాడు పోలీసు దుస్తుల్లో ఓ నంబరుకు వీడియో కాల్ చేశాడు! ‘మేం ముంబై పోలీసులం. మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నాం’ అని హెచ్చరించాడు. ఆవలి వ్యక్తి వీడియో కాల్‌లో తెర మీద కనిపించకుండా సైబర్ నేరగాడిని గౌరవంగా ‘సర్’ అని సంబోధించాడు. హెచ్చరికలన్నీ ఆలకించి.. కొద్దిసేపటికి తెరమీద దర్శనమిచ్చాడు! కనిపించిన ఆ వ్యక్తిని చూసి సైబర్ నేరగాడు వణికిపోయాడు! కారణం.. ఆ కేటుగాడు వీడియో కాల్ చేసింది సాక్షాత్తు యూనిఫాంలో ఉన్న సైబర్‌సెల్ పోలీస్ అధికారికి! ‘నీ లొకేషన్.. అడ్రస్ సహా అన్నీ నా వద్ద ఉన్నాయ్. నువ్వు ఫోన్ చేసింది సైబర్ సెల్ కార్యాలయానికి బ్రదర్’ అని నేరగాడితో పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.
Updated Date - Nov 16 , 2024 | 04:06 AM