ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

National: తూర్పు బంగాళాఖాతంలో నేడు తుఫాన్‌

ABN, Publish Date - May 25 , 2024 | 04:41 AM

రీమల్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.

రేపు రాత్రి బెంగాల్‌-బంగ్లాదేశ్‌ మధ్య తీరం దాటనున్న ‘రీమల్‌’

విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): రీమల్‌ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి మే 26వ తేదీ అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనావేసింది.

‘పశ్చిమ బెంగాల్‌లోని క్యానింగ్‌కు 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాను శనివారం (మే25) ఉదయం నాటికి తుఫానుగా మారే అవకాశముంది. అక్కడి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా తుఫానుగా మారే అవకాశం ఉంది. తదనంతరం దాదాపు ఉత్తరం వైపు కదిలి 25 రాత్రికి తీవ్ర తుఫానుగా మారుతుంది. వాయుగుండం...తుఫాన్‌గా మారి పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ దిశగా వెళుతున్నందున రాష్ట్రంపై ప్రభావం పెద్దగా ఉండదు.

Updated Date - May 25 , 2024 | 07:06 AM

Advertising
Advertising