ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai Dating scam: అబ్బాయిలను బురిడీ కొట్టిస్తున్న అందమైన అమ్మాయిలు

ABN, Publish Date - Aug 24 , 2024 | 02:26 PM

అన్నింటికి యాప్‌లు వచ్చేశాయి. అందులోభాగంగా డేటింగ్ యాప్‌‌లు సైతం వెల్లువెత్తాయి. ఈ డేటింగ్ యాప్‌‌ను ఆసరాగా చేసుకుని.. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఓ పెద్ద కుంభకోణమే జరుగుతుంది. దీంతో పలువురు పురుషుల జేబులు గుల్ల చేసుకుని బాధితులుగా మారి.. లబోదిబోమంటున్నారు.

అన్నింటికి యాప్‌లు వచ్చేశాయి. అందులోభాగంగా డేటింగ్ యాప్‌‌లు సైతం వెల్లువెత్తాయి. ఈ డేటింగ్ యాప్‌‌ను ఆసరాగా చేసుకుని.. దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఓ పెద్ద కుంభకోణమే జరుగుతుంది. దీంతో పలువురు పురుషుల జేబులు గుల్ల చేసుకుని బాధితులుగా మారి.. లబోదిబోమంటున్నారు. ఈ కుంభకోణాన్ని ముంబయికి చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ ఇటీవల వెలుగులోకి తీసుకు వచ్చారు.

ఈ డేటింగ్ యాప్ ద్వారా అంధేరి వెస్ట్‌లోని ది గాడ్ ఫాదర్ క్లబ్.. ఈ తరహా మోసానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ యాప్ ద్వారా ప్రతీ రోజు.. దాదాపు 12 మంది బాధితులుగా మారుతున్నారని వెల్లడించారు. బాధితులుగా మారిన వారు రూ. 23 వేల నుంచి రూ. 61 వేల వరకు నగదు చెల్లిస్తున్నారని తెలిపారు.


వేలకు వేలు నగదు చెల్లించిన బాధితులకు సంబంధించిన బిల్లులను ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ పోస్ట్‌ నాలుగు మిలియన్ల మంది వీక్షించారు. ఇక ఈ వ్యవహారంపై నెటిజన్లు సైతం తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.


ఇంతకీ ఏం జరిగుతుందంటే... ఈ డేటింగ్ యాప్ ద్వారా అందమైన అమ్మాయిలను కనెక్టివిటీ చేస్తారు. వారు... తమ మాటల ద్వారా అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. అలా వారిని మాటల్లో పెట్టి.. ఆ హోటల్, ఈ హోటల్ అంటూ.. పెద్ద పెద్ద హోటళ్లకు అబ్బాయిలను తీసుకు వెళ్తారు. ఆ క్రమంలో తమకు నచ్చిన ఫుడ్‌కు ముందు వారు ఆర్డర్ ఇస్తారు.

శుభ్రంగా తినేసి.. ఇప్పుడే వస్తామనంటూ అబ్బాయిలకు ఆ అందమైన అమ్మాయిలు.. హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇవేమీ తెలియని అబ్బాయిలు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ.. అక్కడే కుర్చుంటారు. చివరకు బిల్లు తెమ్మని వెయిటర్‌కు చెబుతారు. అలా వెయిటర్ తీసుకు వచ్చిన బిల్లు చూసి ఆ అబ్బాయిల గుండె గుబేలుమంటుంది.


తాము మోసపోయామని వారు అర్థం చేసుకునే లోపే జేబు లేకుంటే.. బ్యాంక్ ఖాతాలోని నగదు మొత్తం ఖాళీ అయిపోతుంది. తమకు జరిగిన నష్టాన్ని వివరించేందుకు వారు పోలీసులను ఆశ్రయిస్తారు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఇక ఓ వైపు ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంటుంది. మరోవైపు ఈ డేటింగ్ యాప్ ద్వారా అమాయక జీవులు ప్రతీ రోజు బలవుతూనే ఉంటారు.

అయితే ఒకే అమ్మాయి.. ముగ్గురు అబ్బాయిలను ఇలా డేటింగ్ యాప్ ద్వారా మోసం చేయడం గమనార్హం. ఈ యాప్‌ల ద్వారా కనెక్టివిటీ అయ్యే అందమైన మహిళలకు 20 నుంచి 30 శాతం మేర కమిషన్ అందుతుందని తెలుస్తుంది. ఇక హోటళ్లలో బిల్లులు చెల్లించకుంటే మాత్రం బౌన్సర్లతో దాడి చేయిస్తున్నారని అబ్బాయిలు ఈ సందర్బంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 24 , 2024 | 03:34 PM

Advertising
Advertising
<