Jammu Kashmir: జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై నేడు నిర్ణయం.. సీఎంగా ఒమర్ అబ్దుల్లా..
ABN, Publish Date - Oct 11 , 2024 | 08:29 AM
నేడు జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇటివల శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా సీఎంగా పదవీ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నిర్ణయం గురించి వేచి చూస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఏం అన్నారో ఇక్కడ చుద్దాం.
జమ్మూ కశ్మీర్‌లో(Jammu and Kashmir) ప్రభుత్వం ఏర్పాటు గురించి నేడు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) సీఎంగా పదవీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ సీట్ల సంఖ్య 46కు చేరింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు పార్టీకి మద్దతివ్వడంతో మెజారిటీ మార్కు 46కు చేరుకుందని ఒమర్ అబ్దుల్లా గురువారం (అక్టోబర్ 10) ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ నుంచి నేడు ప్రకటన రానున్నట్లు వెల్లడించారు. ఎన్‌సీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయనను పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర హోదాపై
ఈ అంశంపై కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నామని, అది తెలియగానే వీలైనంత త్వరగా గవర్నర్ వద్దకు వెళ్తామని ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కాంగ్రెస్‌కు ఈరోజు సమయం ఇచ్చామని వెల్లడించారు. అంతేకాదు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రతిపాదనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ప్రతిపాదనను ఆమోదిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రి, ఇతర మంత్రులతో చర్చలు జరుపుతానని వెల్లడించారు. అదే సమయంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున లెఫ్టినెంట్ గవర్నర్ (LG)తో సమన్వయం అవసరమని కూడా అబ్దుల్లా ప్రస్తావించారు.
అందరి కోసం
ఎల్‌జీకి, ప్రభుత్వానికి మధ్య పెద్ద గొడవలు అక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. మా లక్ష్యం శాంతియుత సహకారం, ప్రజల కోసం పనిచేయడమేనని అన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్ర హోదా వస్తుందని ఆశిస్తున్నామని అబ్దుల్లా వెల్లడించారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు సేవ చేయడానికి మేము అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా భవిష్యత్ ప్రభుత్వం అందరి కోసం పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
ఓటు వేయకున్నా
మాకు ఓటు వేయని వారిపై ప్రతీకారం తీర్చుకోబోవడం లేదన్నారు. రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో పాటు ఓటింగ్‌కు దూరంగా ఉన్న వారికి కూడా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పారు. బీజేపీకి ఓటు వేసిన జమ్మూ ప్రజలకు కూడా ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనపై నమ్మకం ఉంచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
దాడులు
మరోవైపు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ (CPIM) గూండాయిజానికి పాల్పడుతున్నాయని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ఆరోపించింది. పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైనందుకు ఒమర్ అబ్దుల్లాను PDP నాయకురాలు ఇల్తిజా ముఫ్తీ అభినందించారు.
ఇవి కూడా చదవండి:
Police Seize: స్నాక్స్ ప్యాకెట్ల చాటున డ్రగ్స్ సరఫరా.. రూ.2,000 కోట్ల విలువైన సరుకు పట్టివేత
IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి
Read More National News and Latest Telugu News
Updated Date - Oct 11 , 2024 | 09:52 AM