ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AAP Ministers Detained: పోలీసుల అదుపులో ఢిల్లీ ఆప్ మంత్రులు.. కాంగ్రెస్ రియాక్ట్

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:07 PM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు(Arvind Kejriwal Arrest)కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలుపల, ITO వద్ద నిరసన చేస్తున్న ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bharadwaj), అతిషి(atishi) సహా పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు(Arvind Kejriwal Arrest)కు నిరసనగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వెలుపల, ITO వద్ద నిరసన చేస్తున్న ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్(Saurabh Bharadwaj), అతిషి(atishi) సహా పలువురు ఆప్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో నిరసనకారులతోపాటు అతిషిని పోలీసులు బస్సులోకి ఈడ్చుకెళ్లి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


అరవింద్ కేజ్రీవాల్‌ను తన లాయర్‌ను, కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని, ఆయన తన అధికారిక పని చేయడానికి కూడా అనుమతించాలని సుప్రీంకోర్టును డిమాండ్ చేస్తామని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఆందోళన(protest) చేస్తున్న క్రమంలో ఢిల్లీ(delhi)లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.


అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్(kc venugopal) స్పందించారు. మేము ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. ప్రతీకార రాజకీయాల నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై ఈడీ దాడులు చేస్తుందని ఆరోపించారు. తాము సొంతంగా గెలవలేమని బీజేపీకి తెలుసని, అందుకే ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది భారతదేశాన్ని నిరంకుశ దేశంగా మార్చే ఎత్తుగడకు నిదర్శమని అన్నారు.


మరోవైపు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(mohan yadav) కేజ్రీవాల్ అరెస్టుపై రియాక్ట్ అయ్యారు. ఒక సీఎంగా ఆయన జైలుకు వెళ్లడం దురదృష్టకరమని చెప్పారు. అలాంటి పదవిపై అరవింద్ కేజ్రీవాల్‌కు దురాశ తగదని, సీఎం పదవికి రాజీనామా చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Kapil Sibal: కేజ్రీవాల్ అరెస్ట్‌పై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ రియాక్ట్.. మధ్యాహ్నం కోర్టుకు

Updated Date - Mar 22 , 2024 | 12:09 PM

Advertising
Advertising