Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు
ABN, Publish Date - Nov 22 , 2024 | 04:34 PM
ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్‌లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.
న్యూఢిల్లీ: నిషేధం ఉన్నప్పటికీ డీజిల్ ట్రక్కులు, బస్సులు స్వేచ్ఛగా ఢిల్లీ రోడ్లపై తిరుగుతుండటాన్ని సుప్రీంకోర్టు (Suprme Court) సీరియస్‌గా పరిగణించింది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద నిఘా తప్పనిసరిగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలిచ్చింది. జీఆర్‌ఏపీ (గ్రేడెట్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్) IV ఆంక్షలను ప్రధానమైన 13 ఎంట్రీ పాయింట్ల వద్ద ఏర్పాటు చేసి, గట్టి నిఘా ఉంచినట్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఆగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీంతో 113 ప్రవేశ మార్గాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది.
Indian Navy: జలాంతర్గామిని ఢీకొన్న చేపల వేట పడవ... 11 మంది సురక్షితం, ఇద్దరు గల్లంతు
జీఆర్ఏపీ IV నిబంధనల ప్రకారం, ఢిల్లీలో బీఎస్-3, బీఎస్-ఐవీ డీజిల్ ఫోర్ వీలర్ల ప్రవేశంపై ఢిల్లీలో నిషేధం ఉంది. ఢిల్లీలో ఈ వారంలో వాతావరణ కాలుష్య నాణ్యత ''సివియర్ ప్లస్'' స్థాయికి చేరుకోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ సందర్భంగా, మొత్తం 113 ప్రవేశమార్గాల్లో 100 ఎంట్రీ పాయింట్ల వద్ద ట్రక్కుల ప్రవేశంపై చెకింగ్‌లు లేవని, తక్షణం మొత్తం అన్ని చెక్‌పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జీఆర్‌ఏపీ IV నిబంధనలను సరిగా అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్‌లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.13 ఎంట్రీ పాయింట్ల వద్ద రికార్డయిన సీసీటీవీ సామగ్రిని తమకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. చెక్ పాయింట్లకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా బార్ సభ్యులను ఆదేశిస్తామని తెలిపింది. కోర్టు నియమించిన లాయర్లు ఇచ్చే నివేదికను వచ్చే సోమవారంనాడు సమీక్షిస్తామని, అప్పటివరకూ జీఆర్ఏపీ IV ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. నివేదికను సమీక్షించిన తరువాతే ఆంక్షలు ఎత్తివేయాలా, కొనసాగించాలా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మసనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు
Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 22 , 2024 | 04:34 PM