ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : జమ్మూలో బీజేపీ అభ్యర్థులపై రగడ

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:10 AM

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.

  • 15 మందితో ‘తొలి దశ’ జాబితా

  • కాంగ్రె‌స్-ఎన్‌సీ సీట్ల పంపకం ఖరారు

  • ఎన్‌సీకి 51, కాంగ్రె్‌సకు 32 సీట్లు

  • మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీ..

న్యూఢిల్లీ, ఆగస్టు 26: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. సోమవారం 44 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. అయితే పలువురు కీలక నేతలకు టికెట్లు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. దీంతో కొద్ది గంటల్లోనే ఆ జాబితాను బీజేపీ ఉపసంహరించుకుంది. చివరకు కేవలం తొలిదశ ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల కోసం 15 మందితో ఓ జాబితాను మళ్లీ ప్రకటించింది. బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసనల్లో ఓ కార్యకర్త మాట్లాడుతూ.. ‘మాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి బీజేపీతోనే ఉన్నాం.

జమ్మూ నార్త్‌లో ఒమీ ఖజూరియా అందరికీ తెలిసిన వ్యక్తి.. ఆయన్ను కాదని కాంగ్రెస్‌ నుంచి పార్టీలో చేరిన శ్యామ్‌లాల్‌ శర్మకు టికెట్‌ ఇచ్చారు. ఖజూరియాకు టికెట్‌ ఇస్తేనే బీజేపీలో ఉంటాం’ అని తేల్చి చెప్పారు. ఇటు కాంగ్రె్‌స-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం 90 స్థానాల్లో ఎన్‌సీ 51, కాంగ్రెస్‌ 32 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మరో 5 చోట్ల ఇరు పార్టీలు స్నేహ పూర్వక పోటీకి దిగాలని.. అలాగే సీపీఎంకు ఒక సీటు, పాంథర్స్‌ పార్టీకి ఒక సీటు ఇవ్వాలని నిర్ణయించాయు.


సీట్ల పంపకాలపై నెలకొన్న విభేధాలను పరిష్కరించుకునేందుకు ఎన్‌సీ నేతలతో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జరిపిన చర్చలు ఫలించాయి.

ఎన్‌సీ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా నివాసాలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, మరో నేత సల్మాన్‌ ఖుర్షీద్‌, జమ్మూ కశ్మీర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ భరత్‌ సోలంకి వెళ్లి సుదీర్ఘ మంతనాలు జరిపారు.

  • లద్దాఖ్‌లో 5 కొత్త జిల్లాలు..

కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌లో 5 కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌ మేరకు లద్దాఖ్‌ అభివృద్ధికి 5 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

కొత్తగా ఏర్పాటు చేసే జన్‌స్కర్‌, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌ జిల్లాలతో పాలన మరింత పటిష్ఠమవుతుంది. ప్రతీ ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందుతాయి’ అని షా ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘లద్దాఖ్‌ ప్రజల శ్రేయస్సు, మెరుగైన పాలనకు ఇదో ముందడుగు. కొత్త జిల్లాలతో ప్రజలకు అవకాశాలు, సేవలు మరింత చేరువవుతాయి’ అని వెల్లడించారు.

Updated Date - Aug 27 , 2024 | 05:10 AM

Advertising
Advertising
<