ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : కవితతో కేటీఆర్‌ ములాఖత్‌

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:34 AM

తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. సోమవారం ఉదయం జైలుకు వెళ్లి కవితతో ములాఖత్‌ అయ్యారు.

  • అనారోగ్యంతో బాధపడుతున్న చెల్లెల్ని చూసి కేటీఆర్‌ భావోద్వేగం

  • కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఆగస్టు 5కు వాయిదా

న్యూఢిల్లీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కలిశారు. సోమవారం ఉదయం జైలుకు వెళ్లి కవితతో ములాఖత్‌ అయ్యారు. కవిత వారం, పది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత మంగళవారం ఆమె అస్వస్థతకు గురికావడంతో జైలు వైద్యుల సూచనల మేరకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ హాస్పిటల్‌కు తరలించి వైద్య చికిత్స అందించారు. అనంతరం కోర్టు అనుమతితో కవితకు జైలు అధికారులు శుక్రవారం ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో ఆమెను పరామర్శించేందుకు ఆదివారమే కేటీఆర్‌ ఢిల్లీ వచ్చారు. న్యాయ నిపుణులతో చర్చించామని, తప్పకుండా బెయిల్‌ వస్తుందని ధైర్యం చెప్పినట్టు తెలిసింది. ఆమెను చూసి కేటీఆర్‌ భావోద్వేగానికి గురైనట్టు తెలిసింది. ఆమె తన ఆరోగ్య, మానసిక పరిస్థితి గురించి వివరించినట్టు సమాచారం. ఆమె బెయిల్‌ పిటిషన్‌పై విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు ఆగస్టు 5కు వాయిదా వేసింది. ఆమెతో పాటు మరో నలుగురి ప్రమేయంపై సీబీఐ అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 26న విచారణ చేపడతామని తెలిపింది.

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు బీఆర్‌ఎస్‌!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే పనిలో ఉంది. ఈ విషయమై కేటీఆర్‌ రెండు రోజులుగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావు పిరాయింపులపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు వేచిచూడాలా? లేక ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చిస్తున్నారు. న్యాయవాదులు సూచిస్తే రెండుమూడు రోజుల్లో బీఆర్‌ఎస్‌ తరపున సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని యోచిస్తున్నారు.

Updated Date - Jul 23 , 2024 | 05:34 AM

Advertising
Advertising
<