ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi CM: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. అరెస్ట్ తప్పదా..?

ABN, Publish Date - Mar 18 , 2024 | 10:26 AM

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమాద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రేజీవాల్‌ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.

Arvind Kejriwal

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు జారీ చేసిన సమన్లు అక్రమమని ఆయన పేర్కొన్నారు. ఆమాద్మీ పార్టీ సైతం ఈడీ నోటీసులు చట్టవిరుద్దమని ప్రకటించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రేజీవాల్‌ను టార్గెట్ చేసి వేధిస్తోందని, దీనికోసం ఈడీని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ జలబోర్డులో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసులోనూ కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లలేదు. కేవలం కోర్టుకు మాత్రమే ఆయన హాజరయ్యారు. ఈడీ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమని ఆప్ (AAP) ఆరోపిస్తోంది. ఎటువంటి అవకతవకలు జరగకపోయినా.. తమను వేధించేందుకు బీజేపీ అక్రమ కేసులు బనాయిస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఏం జరగబోతుంది..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. ఇటీవల ఎమ్మె్ల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో చాలా మంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. దీంతో కేజ్రీవాల్‌ అరెస్ట్ తప్పదని అంతా భావించారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించినట్లు అంతా భావించారు. ఈలోపు ఢిల్లీ జలబోర్డు కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. కేజ్రీవాల్ మాత్రం ఈ నోటీసులకు తాను స్పందించేది లేదని తెగేసి చెబుతున్నారు. దీనిలో భాగంగా ఈడీ విచారణకు హాజరుకాలేదు.

9వ సారి..

మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 9వ సారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేసింది. ఈ నోటీసుల ప్రకారం ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్తారా.. లేదా అనేదానిపై క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు ఈడీ విచారణకు వెళ్తే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అనుమానంతోనే కేజ్రీవాల్ వెళ్లనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఈసారి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. విచారణకు ఆయనను పిలవొద్దని ఈడీకి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో తొమ్మిదోసారి ఈడీ సమన్లపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 18 , 2024 | 10:26 AM

Advertising
Advertising