Delhi: కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్తారు.. కాని.. ఆప్ మంత్రి సంచలన ప్రకటన..!
ABN, Publish Date - Mar 21 , 2024 | 01:38 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 9వ సారి సమన్లు అందుకున్నప్పటికి.. సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కేజ్రీవాల్‌ను విచారణకు రమ్మని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీ విచారణ అంశంపై ఆప్ మంత్రి అతిషి మర్లీనా స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 9వ సారి సమన్లు అందుకున్నప్పటికి.. సీఎం కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కేజ్రీవాల్ (KEJRIWAL)ను విచారణకు రమ్మని ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈడీ విచారణ అంశంపై ఆప్ మంత్రి అతిషి మర్లీనా స్పందించారు. ఈడీ విచారణకు కేజ్రీవాల్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే తనను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలివ్వాలంటూ కేజ్రీవాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని అతిషి తెలిపారు.
విచారణకు వెళ్తే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న అనుమానం తమకు ఉందన్నారు. సీఎం కేజ్రీవాల్ ఈడీ దర్యాప్తునకు హాజరవ్వాలనుకుంటున్నారని, కాని ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను తాము స్వతంత్ర సంస్థగా చూడటం లేదని, అది బీజేపీకి రాజకీయ సాధనంగా పని చేస్తుందని అతిషి ఆరోపించారు.
Delhi CM Aravind Kejriwal: మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని ఈడీ భావిస్తోదంని, ఒకవేళ ఆయన దర్యాప్తు సంస్థ విచారించాలనుకుంటే.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయబోమని కోర్టులో ఈడీ చెప్పాలని మంత్రి అతిషి పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 9 సార్లు నోటిసులు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరుకాకపోవడంతో.. ఇక ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కోర్టు తీర్పు ఆధారంగా కేజ్రీవాల్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్ల తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 21 , 2024 | 01:39 PM