Delhi : ఒక్కో ఫిర్యాదుపై విచారణకు రూ.37.82 లక్షల ఖర్చు
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:21 AM
దేశంలో అవినీతిపై పోరాటానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన లోక్‌పాల్ నిర్వహణ వ్యయం భారీగా ఉంటోంది. గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులు 739 మాత్రమే కాగా.. 2021-22, 22-23, 23-24 సంవత్సరాల్లో ఆ సంస్థ మొత్తం బడ్జెట్ రూ.329.17 కోట్లు.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశంలో అవినీతిపై పోరాటానికి కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన లోక్‌పాల్ నిర్వహణ వ్యయం భారీగా ఉంటోంది. గత మూడేళ్లలో వచ్చిన ఫిర్యాదులు 739 మాత్రమే కాగా.. 2021-22, 22-23, 23-24 సంవత్సరాల్లో ఆ సంస్థ మొత్తం బడ్జెట్ రూ.329.17 కోట్లు. ఇందులో 279.52 కోట్లు ఖర్చుచేశారు.
అంటే ఏడాదికి రూ.93.17 కోట్లు, ఒక్కో ఫిర్యాదు పరిష్కారానికి సగటున చేసిన వ్యయం రూ.37.82 లక్షలన్న మాట. 739లో 719 కంప్లయింట్లను లోక్‌పాల్ ప్రాథమిక దశలోనే కొట్టివేయడం గమనార్హం. పంజాబ్‌కు చెందిన సామాజిక కార్యకర్త కమల్ ఆనంద్ ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నలకు లోక్‌పాల్ ఇచ్చిన సమాధానాల్లో పై వివరాలు ఉన్నాయి. మూడేళ్లలో లోక్‌పాల్ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన కేసులు కేవలం 17 మాత్రమే.
Updated Date - Aug 12 , 2024 | 03:22 AM