ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Court: కేజ్రీవాల్‌, కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మళ్లీ పొడిగింపు

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:58 AM

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది.

న్యూఢిల్లీ, జూలై 25: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాఖలు చేసిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించగా.. సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా గురువారం ఆదేశాలు జారీ చేశారు.


అలాగే సిసోడియా, కవితతో పాటు ఇతర నిందితుల జ్యుడీషియల్‌ కస్టడీని కూడా ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తిహాడ్‌ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు.

Updated Date - Jul 26 , 2024 | 05:58 AM

Advertising
Advertising
<