ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Excise policy case: కేజ్రీవాల్‌పై తగిన సాక్ష్యాలున్నాయి.. సీబీఐ ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు

ABN, Publish Date - Sep 03 , 2024 | 04:36 PM

లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌. తదితరులపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పరిగణనలోకి తీసుకుంది. కేజ్రీవాల్, ఇతర నిందితులపై ప్రొసీడింగ్స్‌కు తగిన సాక్ష్యాలున్నాయని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ (Liquor scam)కు సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌ (Durgesh pathak), తదితరులపై సీబీఐ (CBI) దాఖలు చేసిన ఛార్జిషీటును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారంనాడు పరిగణనలోకి తీసుకుంది. కేజ్రీవాల్, ఇతర నిందితులపై ప్రొసీడింగ్స్‌కు తగిన సాక్ష్యాలున్నాయని ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా పేర్కొన్నారు. కేజ్రీవాల్, దుర్గేష్ పాఠక్‌లకు సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 11న జరుగనుంది.

Aparajita anti-rape Bill: 'అపరాజిత' బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం


కేజ్రీవాల్, పాఠక్, వినోద్ చౌహాన్, ఆశిష్ మాథుర్, శరత్ రెడ్డిపై సీబీఐ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఆప్ నేతలు అమిత్ అరోరా, ఆశిష్ మాథుర్, పి.శరత్ రెడ్డి, వినోద్ చౌహాన్‌లకు కూడా కోర్టు సమన్లు పంపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌ కుట్రదారుల్లో అరవింద్ కేజ్రీవాల్ ఒకరని సీబీఐ తన ఛార్జిషీటులో పేర్కొంది. కేజ్రీవాల్‌ ఆదేశాల మేరకే సౌత్ లాబీ నుంచి లిక్కర్ వ్యాపారులు, తయారీదారులతో సీఎం సన్నిహితుడు విజయ్ నాయర్ సంబంధాలు నెరిపినట్టు ఆరోపించింది. సౌత్ లాబీ నుంచి సేకరించిన రూ.100 కోట్ల ముడుపుల సొమ్మును గోవా ఎన్నికల్లో ఉపయోగించినట్టు తెలిపింది. ఆ సమయంలో గోవా ఎన్నికల నిర్వహణ బాధ్యతలను ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ చూసుకున్నట్టు పేర్కొంది. రూ.45 కోట్ల మేరకు లావాదేవీలు (ట్రాన్సాక్షన్స్) జరిగినట్టు ఆరోపించింది. ఎక్సైజ్ పాలసీపై కేజ్రీవాల్, సిసోడియా కలిసి పనిచేశారని నిందితుడు అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. కాగా, సీబీఐ కేసులో సెప్టెంబర్ 11వ తేదీ వరకూ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 03 , 2024 | 04:36 PM

Advertising
Advertising