ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi excise case: మనీష్‌తోపాటు కవిత జ్యుడిషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:02 PM

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది.

న్యూఢిల్లీ, జులై 26: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవితల జ్యుడిషియల్ కస్టడీ జులై 31 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. తీహాడ్ జైల్లోనున్న వీరిని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ కోర్టు ఎదుట పోలీసులు హాజరు పరిచారు. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో వీరిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవల కవితకు వ్యతిరేకంగా కోర్టులో సప్లిమెంటరీ చార్జీషీట్‌ను సీబీఐ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

High alert in Jammu: ఆర్మీ స్కూల్స్ మూసివేత.. ఎందుకంటే..?


మార్చి 15 నుంచి...

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కె. కవితపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీలోని తీహాడ్ జైలుకు తరలించింది. అయితే ఇదే కేసులో ఏప్రిల్ 11వ తేదీన ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆమె తీహాడ్ జైలులోనే ఉన్నారు.

Also Read: Maharashtra: ‘గ్యాంగ్‌స్టర్’ కొంప ముంచిన ఫ్యాన్స్ అత్యుత్సాహం


బెయిల్ కోసం ప్రయత్నం..

బెయిల్ కోసం కోర్టుల్లో తీవ్రంగా ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. మరోవైపు ఇటీవల కవిత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దాంతో ఆమెకు న్యూఢిల్లీలోని దీన దయాల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మరికొద్ది రోజులకు కవిత మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆ క్రమంలో ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో ఎయిమ్స్‌లో ఆమె చికిత్స అందించాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. చికిత్స అనంతరం ఆమెను మళ్లీ తీహాడ్ జైలుకు పోలీసులు తరలించారు.

Also Read: Kargil Vijay Diwas 2024: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాల విమర్శలు.. తిప్పికొట్టిన ప్రధాని మోదీ.. పథకం ఉద్దేశం ఇది..


2023, ఫిబ్రవరి 26 నుంచి తీహాడ్ జైల్లోనే..

ఇక ఇదే కేసులో 2023, ఫిబ్రవరి 26వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఈ కేసులోనే మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఈ ఏడాది మార్చి 9న మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు సైతం నాటి నుంచి బెయిల్ లభించక పోవడం గమనార్హం.


జులై 30న ఇండియా కూటమి నిరసన..

ఇంకోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ సైతం తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజురు చేసినా.. ఈ కేసులో ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఆయన జైల్లోనే ఉండిపోయారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అయితే కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జులై 30న న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహించాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయించారు. అదీకాక అరవింద్ కేజ్రీవాల్‌ను తీహాడ్ జైల్లోనే అంతమొందించేందుకు బీజేపీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కుట్ర చేస్తున్నారంటూ ఆప్ అగ్రనేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

For Latest News and National News click here

Updated Date - Jul 26 , 2024 | 05:07 PM

Advertising
Advertising
<