ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi: హైకోర్టులో దక్కని ఊరట

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:06 PM

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దాడి కేసులో బెయిల్ కోసం బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది.

Bibhav Kumar

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌కు (Bibhav Kumar) ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దాడి కేసులో బెయిల్ కోసం బిభవ్ కుమార్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం తిరస్కరించింది. ‘బిభవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి సెక్రటరీ. అతను అధికారం ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బెయిల్ ఇవ్వలేం అని’ జస్టిస్ అనూప్ కుమార్ మెండిరట్ట నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.


కస్టడీ వద్దు..

బిభవ్ కుమార్‌ కస్టడీ పొడగించడం అవసరం లేదని అతని లాయర్లు వాదించారు. బిభవ్ కస్టడీకి వచ్చి 54 రోజులు పూర్తయ్యింది. ఇప్పటికే అవసరం ఉన్న విచారణ జరిగింది. వెంటనే బెయిల్ ఇవ్వాలి. లేదంటే అతనికి ముందస్తు శిక్షగా భావించాల్సి ఉంటుందని అతని న్యాయవాది ధర్మసనానికి విన్నవించారు. ఢిల్లీ సీఎం సెక్రటరీ ఓ ఎంపీపై ఎందుకు దాడి చేస్తారని ప్రశ్నించారు. ఏ కారణం చేతనైనా ఈ కేసును ఊహించలేం. ఈగో వల్లే బిభవ్.. మాలివాల్‌పై దాడి చేశారా అని ప్రశ్నించారు.



Also Read:Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్

ఎంక్వైరీ కంటిన్యూ

స్వాతి మాలివాల్ దాడి కేసులో విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసులు హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నెల 16వ తేదీ లోపు చార్జీషీట్ దాఖలు చేస్తామని వివరించారు. బిభవ్ కుమార్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోరారు. ఇరువురి తరఫున వాదనలు విన్న ధర్మాసనం.. బిభవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Read Latest Telugu News and National News

Updated Date - Jul 12 , 2024 | 05:06 PM

Advertising
Advertising
<