ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : ఆత్మహత్యల్లో భారత్‌ టాప్‌

ABN, Publish Date - Jul 12 , 2024 | 03:08 AM

ఇటీవల ముంబైలో తండ్రీ కొడుకుల ఆత్మహత్య సంఘటన అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్‌లో యువకులతోపాటు వృద్ధులు కూడా ఎదుర్కొంటున్న.....

  • ప్రతి లక్ష మందిలో 12కు పైగా బలవన్మరణాలు

  • 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య

న్యూఢిల్లీ, జూలై 11: ఇటీవల ముంబైలో తండ్రీ కొడుకుల ఆత్మహత్య సంఘటన అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. భారత్‌లో యువకులతోపాటు వృద్ధులు కూడా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఆత్మహత్య అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవును.. ఇది నిజం అనేలా ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్యలు జరిగిన దేశంగా భారత్‌ నిలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022లో ప్రంచంలోనే అత్యధికంగా భారత్‌లో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు.

దేశంలో ఆత్మహత్యల రేటు ప్రతి లక్షకు 12.4 మందికి పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్న అంశాలేమిటి అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా మొదలైంది. అయితే.. మానసిక ఒత్తిడే దీనికి ప్రధాన కారణమని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో జన్యుపరమైన కారణాలు, కొన్నిరకాల ఒత్తిళ్ల వల్ల ప్రేరేపితమవుతున్న మానసిక అనారోగ్యంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ‘ఆత్మహత్యకు అత్యంత సాధారణ కారణం డిప్రెషన్‌. దీన్నే మేం ఒత్తిడి అని పిలుస్తాం. వెంటాడుతున్న సమస్యల వల్ల ఒత్తిడికి గురికావొచ్చు.

ఒక్కోసారి హఠాత్తుగా క్షణికావేశంలోనూ ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎక్కువ శాతం కేసుల్లో ఒత్తిడే ప్రధాన కారణంగా ఉంటుంది’ అని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ రాజీవ్‌ మెహతా చెప్పారు. సాధారణంగా ఈ ఒత్తిళ్లకు పని, ఆర్థిక పరమైన, మానవ సంబంధాలు, ఆరోగ్య పరమైన సమస్యలు ప్రధాన కారణమని ఆయన చెప్పారు. ఒత్తిడి తీవ్రమైనప్పుడు అది డిప్రెషన్‌గామారి ఆత్మహత్యకు దారితీస్తుందని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో 50-90ు మంది నిరాశ, ఆందోళన, బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక అనారోగ్యంగో బాధపడినవారేనని అధ్యయనాలు సూచిస్తున్నాయి.


  • ఆత్మహత్యలు సామాజిక సమస్య: సుప్రీం కోర్టు

భారత్‌లో ఆత్మహత్యలు పెరగడాన్ని సుప్రీం కోర్టు సామాజిక సమస్యగా అభివర్ణించింది. ఆత్మహత్యలను నివారించడానికి ప్రజారోగ్య కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై అత్యున్నత ధర్మాసనం గురువారం స్పందించింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్రాన్ని ఆదేశించింది. పెరుగుతున్న ఆత్మహత్యలను ఎదుర్కోవడానికి పటిష్ట చర్యలు అవసరమని న్యాయవాది, పిటిషనర్‌ గౌరవ్‌ కుమార్‌ బన్సాల్‌ చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Updated Date - Jul 12 , 2024 | 03:08 AM

Advertising
Advertising
<