Delhi Liquor Policy Case: విచారణకు రావాల్సిందే.. కేజ్రీవాల్‌కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు..
ABN, Publish Date - Mar 17 , 2024 | 10:15 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీచేసినా ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారుల ఫిర్యాదుతో ఢిల్లీ రౌస్ అవెన్యూకోర్టులోని సీబీఐ (CBI) ప్రత్యేక న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. దీంతో మార్చి 16వ తేదీన కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరయ్యారు. కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందేవి కావడంతో విచారణ సమయంలోనే కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కవితతో కలిసి విచారించేందుకేనా..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈనెల 23వ తేదీ వరకు కవితను ఈడీ కస్టడీకి ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో కవితతో కలిసి కేజ్రీవాల్‌ను విచారించేందుకే సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది. ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా.. డుమ్మా కొడతారా అనేది తెలియాల్సి ఉంది.
Updated Date - Mar 17 , 2024 | 10:15 AM