ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Liquor Scam Case: కవితదే మాస్టర్ మైండ్.. ఈడీ సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Apr 04 , 2024 | 04:09 PM

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు.

Delhi Liquor Scam Case

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అని ఆరోపించారు. గురువారం నాడు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిన్డెర్లు ఫైర్ చేశారు కవిత తరఫు న్యాయవాదులు. కుమారుడికి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, మధ్యంతర బెయిల్‌పై ఒక పిటిషన్‌పై విదానలు వినిపిస్తున్నారు అభిషేక్ మను సింఘ్వి. బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ఈడీ తన వాదనలు బలంగా వినిపించింది. కవితపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని ఈడీ బలంగా వాదించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలియజేసింది. కవితకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని ఆరోపించారు. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదన్నారు.

Also Read: అవినాష్ రెడ్డి బెయిల్‌పై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..


విచారణ సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని, కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టుకు వివరించింది ఈడీ. ఈ కేసులో విచారణ సందర్భంగా నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని ఆరోపించారు. ఈ కేసులోని నిందితులు వందల డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారన్నారు. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారని ఆరోపించారు. అంతేకాదు.. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు ఈడీ తరపు న్యాయవాది.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట..

డేంజర్ జోన్‌లో రిషబ్ పంత్..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 04:28 PM

Advertising
Advertising