ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi Lt Governor: అతిషి కాదు.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:54 PM

న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కైలాశ్ గెహ్లాట్ పాల్గొని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

AAP Leader, Delhi Home Minister Kailash Gahlot

న్యూఢిల్లీ, ఆగస్ట్ 13: న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆప్ నేత, హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్ పాల్గొనాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనా ఆదేశించారు. దీంతో చాత్రశాల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కైలాశ్ గెహ్లాట్ పాల్గొని.. కేజ్రీవాల్ ప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఈ మేరకు రాజ్ నివాస్ మంగవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ వేడుకల కోసం చాత్రశాల్ స్టేడియంను ముస్తాబు చేయాలని.. లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసం రాజ్‌నివాస్ సెక్రటరీ అషీశ్ కుంద్రా ఈ మేరకు కేజ్రీవాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Kolkata Doctor's Case: సీబీఐ విచారణకు ఆదేశించిన కోల్‌కతా హైకోర్టు


అతిషీ కాదని.. కైలాశ్ గెహ్లాట్‌కు ఛాన్స్..

మరోవైపు కేజ్రీవాల్ ప్రభుత్వంలో సీనియర్లు, సూపర్ సీనియర్లను పక్కన పెట్టి.. హోం మంత్రి కైలాశ్ గెహ్లాట్‌కు ఈ అవకాశం కల్పించడం పట్ల మరోసారి ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి మధ్య విమర్శలు దాడి జరిగే అవకాశముందని ఓ చర్చ సైతం సాగుతుంది.

Also Read: New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం


మార్చిలో కేజ్రీవాల్ అరెస్ట్.. నాటి నుంచి తీహాడ్ జైల్లోనే..

మద్యం కుంభకోణం మనీలాండరింగ్ వ్యవహారంలో ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఇదే ఏడాది ఏప్రిల్‌లో ఇదే కేసులో సీబీఐ అయన్ని అరెస్ట్ చేసింది. నాటి నుంచి సీఎం కేజ్రీవాల్ తీహాడ్ జైల్లోనే ఉన్నారు. ఆ క్రమంలో ఆయన బెయిల్ కోసం ప్రయత్నించారు. దీంతో స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన సీబీఐ కేసులో అరెస్ట్ కావడంతో.. ఆయనకు బెయిల్ మంజూరీ చేసిన విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఆగస్ట్ 15వ తేదీ. ప్రతీ ఏటా ఆ రోజు చాత్రశాల్ స్టేడియంలో ఆప్ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది.

Also Read: Bangladesh Violence: పలువురు బంగ్లాదేశీయులు అరెస్ట్


కేజ్రీవాల్ హాజరుకాలేదు.. ఎందుకంటే..

ఈ సారి సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేకున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినో్త్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకం ఎగురవేసే అవకాశం ఢిల్లీ మంత్రి అతిషికి కల్పించాలని ఒకటికి రెండు సార్లు.. లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాకు సీఎం కేజ్రీవాల్ లేఖలు రాశారు. దీనిపై లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఎటువంటి స్పందన లేదు. తాజాగా ఆగస్ట్ 15వ తేదీ మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. అలాంటి వేళ.. ఢిల్లీ ఎల్జీ మంగళవారం తనదైన శైలిలో స్పందించారు. అదీ కూడా అతిషి కాదని.. ఆప్ నేత, ఢిల్లీ హోం మంత్రి కైలాశ్ గెహ్లెుట్‌కు ఆ ఆవకాశం కల్పించారు.

Also Read: Bangladesh violence: మాజీ ప్రధాని షేక్ హసీనాపై హత్య కేసు నమోదు

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 06:04 PM

Advertising
Advertising
<